ప్రవాసులకు ఊరట..

ప్రవాస పన్ను చెల్లింపుదారుల వివాదాలను వేగంగా పరిష్కరించేందుకు వీలుగా ‘ఇ-అడ్వాన్స్‌ రూలింగ్‌ స్కీం’ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. ‘ఇ-అడ్వాన్స్‌ రూలింగ్‌ స్కీం 2022’లో భాగంగా

Updated : 21 Jan 2022 12:11 IST

ఇ-అడ్వాన్స్‌ రూలింగ్‌ ప్రారంభం

ప్రవాస పన్ను చెల్లింపుదారుల వివాదాలను వేగంగా పరిష్కరించేందుకు వీలుగా ‘ఇ-అడ్వాన్స్‌ రూలింగ్‌ స్కీం’ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. ‘ఇ-అడ్వాన్స్‌ రూలింగ్‌ స్కీం 2022’లో భాగంగా బోర్డ్‌ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్స్‌ ఎదుట వాదనలు వీడియో కాన్ఫరెన్స్‌, వీడియో టెలిఫోనీ ద్వారా వినిపించేందుకు వీలుందని పేర్కొంది. దీనికోసం ముందుగానే ఇ-మెయిల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రవాస భారతీయులు, నిర్దేశిత పన్నుచెల్లింపుదారులకు సంబంధించి లావాదేవీలపై ఆదాయపు పన్నుకు సంబంధించిన అనుమానాలు వచ్చినప్పుడు, వాటిని పరిష్కరించేందుకు వీలుగా ఈ అడ్వాన్స్‌ రూలింగ్‌ స్కీంను ఏర్పాటు చేశారు. కొత్త మార్పుల ప్రకారం పన్ను చెల్లింపుదారులు, ఆదాయపు పన్ను అధికారులు, అడ్వాన్స్‌ రూలింగ్‌ బోర్డుకు సంబంధించిన సమాచారం అంతా ఎలక్ట్రానిక్‌ విధానంలో జరుగుతుంది. బోర్డ్‌ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్స్‌ నుంచి దరఖాస్తుదారులకు సమాచారమంతా నమోదిత ఇ-మెయిల్‌కు పంపిస్తారు. ఆ తర్వాత దరఖాస్తుదారుడు లేదా అతని ప్రతినిధి తమ సమాధానాలను ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ విధానంలోనే పంపించాల్సి ఉంటుంది. భారత్‌ వెలుపల ఉన్న ఎంతోమంది పన్ను చెల్లింపుదారులు, సంస్థలకు ఇ- అడ్వాన్స్‌ రూలింగ్‌ ప్రయోజనం కలిగించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని