స్థిరాస్తి లో జీఎస్టీ ఎంత పడుతుంది? తప్పక తెలుసుకోండి!

ఆస్తి కొనుగోలుదారులలో జీఎస్టీ గురించిన స్పష్టత లేకపోవడంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు తలెత్తాయి....

Updated : 01 Jan 2021 19:08 IST

ఆస్తి కొనుగోలుదారులలో జీఎస్టీ గురించిన స్పష్టత లేకపోవడంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు తలెత్తాయి.

రియల్ ఎస్టేట్ రంగంలో వర్తించే జీఎస్‌టీ రేట్ల గురించి కొనుగోలుదారులలో చాలా గందరగోళం నెల‌కొంద‌నే చెప్పాలి. జీఎస్‌టీ అమ‌ల్లోకి వ‌చ్చేనాటికి నిర్మాణ దశలో ఉన్న భ‌వ‌నాలు, నిర్మాణం పూర్తైన భ‌వ‌నాల కొనుగోలుపై వర్తించే జీఎస్‌టీ రేట్ల గురించి తెలుసుకుందాం. గత సంవత్సరం డిసెంబరు వరకు, స్థిరాస్తులు, గృహాలు కొనుగోలుపై వర్తించే జీఎస్‌టీ రేటు గురించి అందరిలో గందరగోళం ఉండేది. అయితే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ), నిర్మాణంలో ఉన్న ఆస్తి, నిర్మాణం పూర్తై ఉపయోగించుకోడానికి సిద్ధంగా ఉన్న ఆస్తిపై వర్తించే జిఎస్టి గురించి వివరంగా తెలియచేసింది. జులై 1, 2017 నుంచి భారతదేశంలో అమలులో ఉన్న సేవా పన్ను నిబంధనను జీఎస్‌టీతో భర్తీ చేసిన విషయం మనందరికీ తెలుసు. అప్ప‌టికీ ఆస్తి కొనుగోలుదారులలో జీఎస్‌టీ గురించి స్పష్టత లేకపోవడంతో ఆ సమయంలో చాలా మంది బిల్డర్లు కొనుగోలుదారులను తీవ్ర స్థాయిలో భయాందోళనకు గురి చేశారు. జీఎస్‌టీ అమలైన తరువాత ఆస్తి ధరలు అమాంతం పెరిగిపోతాయని, అందువలన ఇప్పుడే ఆస్తిని కొనుగోలు చేయడం మంచిదని ప్రచారం చేశారు.అంతేకాకుండా, జీఎస్‌టీ పైజీఎస్టీ ప్రభుత్వం నుంచి సరైన వివరణ లేని కారణంగా, పలువురు కొనుగోలుదారులు బిల్డర్లు సృష్టించిన ప్రచారాన్ని నమ్మి మోసపోయారు.

నిర్మాణం పూర్తైన ఫ్లాట్లు, ఆస్తి లేదా ఉపయోగానికి సిద్ధంగా ఉన్న ఆస్తి బదిలీ కొనుగోలుదారుకు ఎలాంటి ఉండదు. ఎందుకంటే ఇందులో ఎలాంటి వ‌స్తు సేవ‌ల తో కూడిన ప‌ని లేదు. కాబ‌ట్టి ఇటువంటి లావాదేవీల‌పై జీఎస్‌టీ వర్తించదు. నిర్మాణం పూర్త‌యి సిద్ధంగా ఉన్న ఆస్తిని కొనుగోలు చేస్తున్నట్లయితే, అప్పుడు మీరు జీఎస్‌టీ మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు.

నిర్మాణం పూర్త‌యిన‌ట్టు ధ్రువ‌ప‌త్రాలుంటే:

మీరు ఆస్తిని కొనకముందే బిల్డర్ నిర్మాణం పూర్త‌యిన‌ట్టు ధ్రువీక‌రించే ప‌త్రాలు (కంప్లిషన్ సర్టిఫికేషన్)ను పొందినట్లయితే, దాన్నిసిద్ధంగా ఉన్న ఆస్తిగా గుర్తించాలి. అటువంటి ఆస్తులపై జిఎస్టి వర్తించదు.

నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లు, ఆస్తులు లేదా వాణిజ్య ఆస్తులకు జీఎస్‌టీ పన్ను రేట్లు:

  • భూమి లేదా విభజించని వాటా భూభాగంలో నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లు, ఆస్తులు లేదా వాణిజ్య ఆస్తులకు వర్తించే జిఎస్టి రేటు ప్రస్తుతం పూర్తి ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) తో 12 శాతంగా ఉంది.
  • నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లు, ఆస్తులు లేదా వాణిజ్యపరమైన ఆస్తులకు అసలు జీఎస్‌టీ రేటు 18 శాతం. ఆస్తి కొనుగోలుదారులు పొందిన చేసిన‌ భూమి లేదా విభజించని వాటా భూమి విలువలో 18 శాతంలో మూడవవంతు.

పునః విక్రయ ఆస్తి లేదా పునః విక్రయ ఫ్లాట్లపై జీఎస్‌టీ రేటు:

పునఃవిక్రయ ఆస్తి లేదా పునః విక్రయ ఫ్లాట్లనేవి ఉపయోగించడానికి సిద్ధంగా ఉండే ఆస్తి. అటువంటి పునః విక్రయ లావాదేవీలలో జీఎస్‌టీ వర్తించదు.

క్రెడిట్ - లింక్డ్ సబ్సిడీ స్కీమ్ (సీఎల్ఏస్ఏస్) కింద కొనుగోలు చేసిన ఇళ్లకు జీఎస్‌టీ రేటు:

ఒకవేళ మీరు క్రెడిట్ - లింక్డ్ సబ్సిడీ స్కీమ్ (సీఎల్ఏస్ఏస్) కింద జనవరి 25, 2018 తరువాత ఆస్తిని కొనుగోలు చేసినట్లయితే, దానిపై వర్తించే జీఎస్‌టీ రేటు 12 శాతంగా ఉంటుంది.

క్రెడిట్ - లింక్డ్ సబ్సిడీ పథకం (సీఎల్ఏస్ఏస్) కింద‌:

  • ఆర్థికపరంగా బలహీన వ‌ర్గాలు (ఈడబ్ల్యూఏస్),
  • త‌క్కువ‌ ఆదాయం క‌లిగిన వారు (ఎల్ఐజీ),
  • ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై అర్బన్) హౌసింగ్ పధకం కింద అన్ని మధ్య ఆదాయ గ్రూప్ -1 (ఏంఎల్జీ-1) లేదా మధ్య ఆదాయ గ్రూప్ -2 (ఏంఎల్జీ-2) వ‌ర్గాల వారు వ‌స్తారు.

నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లు లేదా ఆస్తి పై జీఎస్‌టీ రేటు కింది విధంగా వివిధ కేసుల్లో ఇలా ఉంటుంది.

జూలై 1, 2017కు ముందు చెల్లించినట్లయితే:

ఒకవేళ మీరు జీఎస్‌టీ అమలు చేయడానికి ( అనగా జూలై 1, 2017) ముందే పూర్తి మొత్తాన్ని బిల్డర్ కు చెల్లించినట్లయితే, అటువంటి పరిస్థితిలో జీఎస్‌టీ వర్తించదు కొనుగోలుదారుడు 4.5 శాతం సేవా ప‌న్ను ను మాత్రం చెల్లించవలసి ఉంటుంది.

కొంత మొత్తాన్ని జూలై 1, 2017 ముందు చెల్లించినట్లయితే:

ఒకవేళ మీరు జీఎస్‌టీ అమలు చేయడానికి ( అనగా జూలై 1, 2017) ముందే కొంత మొత్తాన్ని బిల్డర్ కు చెల్లించినట్లైతే, అటువంటి పరిస్థితిలో మీరు చెల్లించిన కొంత మొత్తంపై జీఎస్‌టీ వర్తించదు. కొనుగోలుదారుడు ముందుగా చెల్లించిన కొంత మొత్తంపై 4.5 శాతం సేవాప‌న్ను ను మాత్రం చెల్లించవలసి ఉంటుంది.

పూర్తి మొత్తాన్ని జూలై 1, 2017 తరువాత చెల్లించినట్లయితే:

ఒకవేళ మీరు జీఎస్‌టీ అమలు చేసిన ( అనగా జూలై 1, 2017) తర్వాత పూర్తి అమ్మకపు మొత్తాన్ని బిల్డర్ కు చెల్లించినట్లయితే, కొనుగోలుదార్లు జీఎస్‌టీ చెల్లించవలసి ఉంటుంది.

ఈ క‌థ‌నం ద్వారా ఆస్తి కొనుగోలుదారులకు జీఎస్‌టీ గురించి సందేహాలు నివృతి అయ్యాయని ఆశిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని