WhatsApp: వాట్సాప్‌లో స్పామ్‌ కాల్స్‌తో చిరాకొస్తోందా? ఇలా ఆఫ్‌ చేసుకోండి!

WhatsApp: వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా స్పామ్‌ కాల్స్‌కు చెక్‌ పేట్టే అవకాశం కల్పిస్తోంది.

Published : 20 Jun 2023 17:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్‌ (WhatsApp)లో ఈ మధ్య స్పామ్‌ కాల్స్‌ (spam calls) ఎక్కువైపోయాయి. ఇటీవల చాలా మంది నుంచి ఫిర్యాదులు కూడా వెల్లువెత్తాయి. ముఖ్యంగా అంతర్జాతీయ నెంబర్లతో వస్తున్న కాల్స్‌ చికాకు తెప్పిస్తున్నాయి. వీటికి పరిష్కారంగా వాట్సాప్‌ (WhatsApp) కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా యూజర్లందరికీ దీన్ని మంగళవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది.

తెలియని నెంబర్లు, స్పామ్‌, స్కామ్‌ కాల్స్‌ను సైలెన్స్‌ చేసేలా ‘సైలెన్స్‌ అన్‌నోన్‌ కాలర్స్‌ (Silence Unknown Callers)’ ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నట్లు వాట్సాప్‌ (WhatsApp) ఈరోజు ప్రకటించింది. ఈ తరహా కాల్స్‌ వచ్చినప్పుడు మీ ఫోన్‌లో ఎలాంటి రెస్పాన్స్‌ ఉండదు. అంటే రింగ్‌ రావడం కానీ, స్క్రీన్‌పై కాల్‌ వస్తున్నట్లుగా కానీ కనిపించదని తెలిపింది. అయితే, కాల్‌ లిస్ట్‌లోకి వెళితే మాత్రం కాల్‌ వచ్చిన నెంబర్లన్నీ కనిపిస్తాయని పేర్కొంది. ఫలితంగా ఒకవేళ ఏవైనా ముఖ్యమైన కాల్స్‌ ఉంటే చూసుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించింది.

ఈ ఫీచర్‌ను ఇలా యాక్టివేట్‌ చేయాలి..

  • వాట్సాప్‌ను ఓపెన్‌ చేయాలి.
  • కుడివైపు పై భాగంలో ఉండే మూడు చుక్కలపై క్లిక్‌ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
  • ప్రైవసీలోకి వెళ్లగానే పైన ‘ప్రైవసీ చెకప్‌’ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది.
  • ‘స్టార్ట్‌ చెకప్‌’పై క్లిక్‌ చేయాలి.
  • ‘చూజ్‌ కెన్‌ కాంటాక్ట్‌ యూ’ను ఎంపిక చేసుకోవాలి.
  • కనిపించే మెనూలో ‘సైలెన్స్‌ అన్‌నోన్ కాలర్స్‌’పై క్లిక్‌ చేయాలి.
  • తర్వాత ‘సైలెన్స్‌ అన్‌నోన్ కాలర్స్‌ ఆప్షన్‌’ను ఆన్‌ చేయాలి.

ఇక మీ కాంటాక్ట్‌ లిస్ట్‌లో లేని ఏ నంబర్‌ నుంచి కాల్స్‌ వచ్చినా.. అవి మిమ్మల్ని డిస్టర్బ్‌ చేయబోవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని