బ్యాంకు ఖాతాతో పాన్‌ అనుసంధానం అయ్యిందా... తెలుసుకోవ‌డం ఎలా?

ఆదాయ‌పు ప‌న్ను శాఖ నేటి నుంచి ఈ-రీఫండ్లు నేరుగా బ్యాంకు ఖాతాకు జ‌మ‌చేయ‌నుంది. ఇందుకు బ్యాంకు ఖాతా-పాన్‌ అనుసంధానం త‌ప్ప‌నిస‌రి. ఆదాయ‌పు ప‌న్ను దాఖ‌లు చేసే వారు, త‌మ పాన్ నెంబ‌రును ఆధార్‌తో ..

Published : 25 Dec 2020 12:55 IST

ఆదాయ‌పు ప‌న్ను శాఖ నేటి నుంచి ఈ-రీఫండ్లు నేరుగా బ్యాంకు ఖాతాకు జ‌మ‌చేయ‌నుంది. ఇందుకు బ్యాంకు ఖాతా-పాన్‌ అనుసంధానం త‌ప్ప‌నిస‌రి. ఆదాయ‌పు ప‌న్ను దాఖ‌లు చేసే వారు, త‌మ పాన్ నెంబ‌రును ఆధార్‌తో అనుసంధానించ‌డం త‌ప్ప‌నిస‌రి చేసిన సంగ‌తి తెలిసిందే. ఇందుకు గానూ మార్చి 31 వ‌ర‌కు గ‌డువు పొడిగించింది. అయితే తాజాగా ఆదాయ‌పు ప‌న్ను వాప‌సులు పొందాలంటే, త‌మ బ్యాంకు ఖాతా నెంబ‌రుతో పాన్ నెంబ‌రును త‌ప్ప‌నిస‌రిగా అనుసంధానించాలని ఆదాయ‌పు ప‌న్ను శాఖ తెలిపింది. మీరు బ్యాంకు ఖాతా తెరిచే స‌మ‌యంలో పాన్ నెంబ‌రును ఇప్ప‌టికే ఇచ్చిన‌ప్ప‌టికీ ఆదాయ‌పు ప‌న్ను శాఖ వారి స‌మాచారంలో అనుసంధానించిన‌ట్లు లేక‌పోతే ఆదాయ‌పు ప‌న్ను వాప‌సులు పొంద‌లేరు. నేటి నుంచి ఆదాయపన్ను వాప‌సులు ఈ-రిఫండ్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాకు జ‌మ‌వుతుంది, ఇందుకోసం పొదుపు, క‌రెంటు, ఓవర్డ్రాఫ్ట్, క్యాష్‌ ఏదైనా ఖాతాను ఇవ్వ‌వ‌చ్చు. అయితే ఆ బ్యాంకు ఖాతా త‌ప్ప‌నిస‌రిగా పాన్‌తో అనుసంధానించి ఉండాలి.

ఆదాయ‌ప‌న్ను శాఖ ఇప్పటివరకు రెండు ప‌ద్ధ‌తుల ద్వారా ఆదాయ‌పు ప‌న్ను వాప‌సులు చెల్లిస్తుంది. బ్యాంకు ఖాతా ద్వారా కానీ, చెక్కులు జారీ చేయ‌డం ద్వారా గానీ చెల్లింపులు చేస్తుంది. ఆదాయ‌పు ప‌న్ను శాఖ తెలిపిన వివ‌రాల‌ ప్ర‌కారం, ప‌న్ను చెల్లింపు దారులు బ్యాంకు ఖాతాను పాన్‌తో అనుసంధానించ‌డం మాత్ర‌మే కాకుండా, అనుసంధాన ప్ర‌కియ పూర్తైన‌ట్లు, ఆదాయ‌పు ప‌న్ను ఈ-ఫైల్లింగ్ వెబ్‌సైట్ ద్వారా ధ్రువీక‌రించుకోవాలి.

తెలుసుకునే విధానం

 మొద‌ట‌గా ఆదాయ‌పు ప‌న్ను ఈ-ఫైలింగ్ పోర్ట‌ల్‌లో మీ యూజ‌ర్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌తో లాగ్ఇన్‌ అవ్వాలి. మీ ప్రొఫైల్ సెట్టింగ్స్‌లో ప్రీ-వ్యాలిడేట్ ఆప్ష‌న్‌ను క్లిక్ చేయండి.
మీ బ్యాంకు పేరు, ఖాతా నెంబ‌రు, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ మొద‌లైన వివ‌రాల‌ను అందించాలి.
♦ మీ బ్యాంక్, ఈ ఫైలింగ్ పోర్ట‌ల్‌తో అనుసంధానించి ఉన్న‌ట్ల‌యితే, ఈవీసీ(ఎల‌క్ట్రానిక్ వెరిఫికేష‌న్ కోడ్‌), నెట్ బ్యాంకింగ్ ద్వారా నేరుగా ప్రీ-వ్యాలిడేష‌న్ ప్ర‌క్రియ పూర్త‌వుతుంది. మీ బ్యాంక్‌, ఈ ఫైలింగ్ పోర్ట‌ల‌తో అనుసంధానించ‌క‌పోతే , ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌కు మీరు అందించిన వివ‌రాల ప్ర‌కారం ధృవీక‌రిస్తుంది.
ఇందులో పాన్ నెంబ‌రు, బ్యాంకు ఖాతాతో అనుసంధానించి లేక‌పోతే మీకు ఖాతా ఉన్న బ్యాంకు(హోమ్‌) బ్రాంచ్‌లో మీ పాన్ కార్డు వివ‌రాల‌ను ఇవ్వాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని