మూడో త్రైమాసికంలో భారత జీడీపీ 6 శాతం: ICRA

జీడీపీ వృద్ధి 2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 6 శాతంగా ఉండొచ్చని క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ ICRA అంచనా వేసింది.

Published : 21 Feb 2024 20:05 IST

దిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 6 శాతంగా ఉండొచ్చని ప్రముఖ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ ICRA అంచనా వేస్తోంది. ఆర్‌బీఐ అంచనా 6.50 శాతంగా ఉంది. ప్రభుత్వ వ్యయంలో మందగమనం, రుతు పవనాలు జీడీపీ వృద్ధిని ప్రభావితం చేశాయని, ఇది పారిశ్రామిక, వ్యవసాయ రంగాలపై ప్రభావం చూపనుందని ICRA పేర్కొంది. ఫిబ్రవరి 29న ప్రభుత్వం అధికారిక డేటాను విడుదల చేయనుంది. సేవారంగంలో మెరుగుదల ఉన్నప్పటికీ పారిశ్రామిక, వ్యవసాయ రంగంలో మందగమనం కారణంగా 2024 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 7.40 శాతంగా ఉన్న జీవీఏ వృద్ధి 3వ త్రైమాసికంలో 6 శాతానికి తగ్గవచ్చని ICRA పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు