Stock Market: స్వల్ప లాభాలతో మొదలైన మార్కెట్‌ సూచీలు

Stock Market Opening Bell: ఆసియా మార్కెట్ల మిశ్రమ సంకేతాలతో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి.

Updated : 12 Jul 2023 09:36 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు బుధవారం స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలపై ఆసియా మార్కెట్లు దృష్టిపెట్టాయి. దీంతో ఆ ప్రభావం దేశీయ సూచీలపైనా పడింది. ఉదయం 9.25  గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 91 పాయింట్ల లాభంతో 65,709 వద్ద, నిఫ్టీ (Nifty) 27 పాయింట్ల లాభంతో 19,466 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి (Rupee) మారకం విలువ 13 పైసలు బలపడి 82.28 వద్ద కొనసాగుతోంది.

ఎన్‌ఎస్‌ఈ (NSE)లో ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐటీసీ, ఓఎన్జీసీ, టైటాన్‌ కంపెనీ షేర్లు రాణిస్తుండగా.. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, మారుతి సుజుకీ, డాక్టర్‌ రెడ్డీస్‌, సిప్లా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అమెరికాలో బుధవారం ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్నాయి. దీంతో నేడు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. జపాన్‌ నిక్కీ 1.16శాతం, దక్షిణ కొరియా కోస్పి 0.15శాతం, కాస్‌డాక్‌ 0.07శాతం కుంగాయి. హాంగాంక్‌కు చెందిన హాంగ్‌సెంగ్‌ సూచీ 1 శాతం లాభంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా మార్కెట్లు కూడా లాభాల్లో ఉండగా.. చైనా సూచీలు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. నిన్న అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. డోజోన్స్‌ 0.93శాతం, నాస్‌డాక్‌ 0.55శాతం, ఎస్‌అండ్‌పీ 500 సూచీ 0.67శాతం ఎగబాకాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని