IndiGo: తగ్గిన ఇండిగో విమాన టికెట్ల ధరలు

IndiGo: మూడు నెలల క్రితం ఇండిగో విమాన టికెట్లపై ‘ఇంధన ఛార్జీ’ని ప్రవేశపెట్టింది.

Published : 04 Jan 2024 13:43 IST

దిల్లీ: టికెట్లపై ప్రత్యేకంగా వసూలు చేస్తున్న ‘ఇంధన ఛార్జీ’ని తొలగిస్తున్నట్లు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) ప్రకటించింది. ఇంధన ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో మూడు నెలల క్రితం దీనిని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తొలగింపు నిర్ణయం నేటి నుంచే అమల్లోకి వచ్చిందని వెల్లడించింది. 

విమాన ఇంధన ధరలు (ATF prices) ఇటీవల దిగొచ్చిన నేపథ్యంలోనే ప్రత్యేక ఛార్జీని తొలగించాలని నిర్ణయించినట్లు ఇండిగో (IndiGo) తెలిపింది. అయితే, ఏటీఎఫ్‌ ధరలు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉన్న నేపథ్యంలో టికెట్ల ధరలనూ అందుకనుగుణంగా సవరిస్తామని స్పష్టం చేసింది. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో ఇంధనానిదే సింహభాగం. 

విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధరను ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలు జనవరిలో 3.9 శాతం తగ్గించాయి. ధర తగ్గింపు వరుసగా ఇది మూడోసారి. ఇప్పటి వరకు దిల్లీలో కిలోలీటరు ధర రూ.1,06,155.67 కాగా, రూ.4162.50 తగ్గించడంతో రూ.101,993.17కు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని