విద్యా రుణాలు పొందేవారికి వడ్డీ రేట్లు ఏ బ్యాంక్‌లో ఎంతెంత?
అనేక బ్యాంకులు విద్యార్ధుల కెరీర్, తిరిగి చెల్లించే సామర్ధ్యాన్ని బట్టి రుణాలను అందిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఉన్నత విద్య కోరుకునే వారికి 6.70% వడ్డీ రేటు నుంచే విద్యా రుణాలు అందుబాటులో ఉన్నాయి. మీకు మంచి విద్యార్హతలు ఉండి, ఉన్నత విద్య చదవడానికి అర్హత పొందితే దేశంలో, విదేశాలలోని ప్రముఖ సంస్థలలో చదువుకోడానికి విద్యా రుణం కోసం బ్యాంకులకు దరఖాస్తు చేసుకోవచ్చు. భారత్‌లో విద్యాభ్యాసం చేస్తే రూ. 50 లక్షల వరకు, విదేశాలలో అయితే రూ. 1 కోటి వరకు మొత్తాన్ని విద్యా రుణంగా పొందేందుకు అర్హులు.
విద్యా నేపథ్యం, తల్లిదండ్రుల ఆదాయం, మంచి క్రెడిట్ స్కోర్ మీ రుణ అర్హతను నిర్ణయించడంలో కీలకమైన అంశాలు. భారత్‌లో ఖరీదైన వ్యవహారాలలో ఉన్నత విద్య ఒకటి. దేశం లోపల, వెలుపల ఉన్న ప్రఖ్యాత విద్యా సంస్థల్లో చేరడానికి చాలా కృషి, నగదు కూడా అవసరం. బ్యాంకులు ఉన్నత విద్యకు రుణ సహాయం చేయడానికి కృషి చేస్తున్నాయి. అనేక బ్యాంకులు విద్యార్థుల కెరీర్ వృద్ది, తిరిగి చెల్లించే సామర్థ్యం ఉన్న అర్హత కలిగిన విద్యార్థులకు రుణాలను అందిస్తున్నాయి.
డాక్యుమెంటేషన్ ప్రక్రియ కూడా కనిష్ఠంగా ఉండేలా బ్యాంకులు చర్యలు తీసుకుంటున్నాయి. తద్వారా విద్యార్థులు ఎటువంటి అవాంతరాలూ లేకుండా విద్యా రుణాలను పొందొచ్చు. బ్యాంకులు కూడా నిజమైన విద్యార్థులకు మాత్రమే రుణాలను మంజూరు చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. వివిధ బ్యాంకులు నిర్ణయించిన ప్రమాణాలను బట్టి విద్యా రుణాలను ఆమోదించే ప్రక్రియ మారొచ్చు.
రుణాన్ని తిరస్కరించకుండా ఉండటానికి విద్యా రుణం కోసం దరఖాస్తు చేసేటపుడు మీ విద్యా పత్రాలు అన్నీ దగ్గర ఉంచుకోవడం చాలా కీలకం. అడ్మిషన్ వివరాలు, సర్టిఫికెట్లు, ప్రవేశ పరీక్ష స్కోర్లు మొదలైన మీ గత, ప్రస్తుత విద్యా సంస్థల నుంచి అవసరమైన పత్రాలను సేకరించి పెట్టుకోవడం చాలా అవసరం.
అర్హతలు: భారతీయ బ్యాంకుల నుంచి విద్యా రుణం పొందడానికి మీరు తప్పనిసరిగా భారతీయులై ఉండాలి. మీ వయస్సు 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి. మీ తల్లిదండ్రుల ఆదాయం స్థిరమైనది అయి ఉండాలి. మీరు ఎక్కడ చదువుకుంటారని అనుకుంటున్నారో ఆ విశ్వవిద్యాలయం దేశంలో ఉన్నా విదేశాలలో ఉన్నా కూడా ప్రభుత్వ గుర్తింపు పొంది ఉండాలి. ఈ నిబంధనలు, షరతులు బ్యాంకుని బట్టి మారవచ్చు. కాబట్టి మీరు విద్యా రుణం కోసం దరఖాస్తు చేసే ముందు మొత్తం ప్రక్రియను చెక్ చేయడం ముఖ్యం.
విద్యార్థులు వారి కోర్సు వ్యవధి ముగిసిన తర్వాత రుణ చెల్లింపు ప్రారంభించవచ్చు. విద్యార్థులకు రుణ చెల్లింపు సమయం తగినంత ఉంటుంది. 8 ఏళ్ల వరకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80ఈ కింద విద్యా రుణం వడ్డీని పన్ను మినహాయింపులుగా క్లెయిమ్ చేయవచ్చు. దీని కోసం, మీ బ్యాంకు నుండి సర్టిఫికెట్ అవసరం.
7 సంవత్సరాల కాలవ్యవధికి రూ. 10 లక్షల విద్యా రుణానికి వడ్డీ రేట్లు, ఈఎంఐలు దిగువ పట్టికలో ఉన్నాయి.
నోట్: ఈ డేటా 2022 ఫిబ్రవరి 23 నాటిది. బ్యాంకు నియమ నిబంధనలు, క్రెడిట్ స్కోర్ ఆధారంగా వడ్డీ రేట్లలో మార్పులుండొచ్చు. ఈఎంఐలో ప్రాసెసింగ్ ఫీజు గానీ, ఇతర ఛార్జీలు గానీ కలపలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్‌కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్‌కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్‌తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?