పీపీఎఫ్ తో రూ. 1 కోటి సాధ్యమేనా?

రూ. 1 కోటి నిధి రావాలంటే నెల నెలా లేదా ఏడాదికి ఎంత మదుపు చేయాలి? దీని గురించి వివరంగా చూద్దాం​​​​​​....

Published : 19 Dec 2020 13:13 IST

రూ. 1 కోటి నిధి రావాలంటే నెల నెలా లేదా ఏడాదికి ఎంత మదుపు చేయాలి? దీని గురించి వివరంగా చూద్దాం

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పీపీఎఫ్(పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్) తో సహా ఇతర చిన్న పొదుపు పధకాల వడ్డీ రేట్లను సవరించింది. ఒకప్పుడు 60 ఏళ్ళ వరకు ఉద్యోగం చేయడానికి అందరు ఇష్టపడేవారు. ఇప్పుడు ఆ పరిష్టితి లేదు. మరుంటున్న జీవం విధానాలు, పని లో ఉన్న ఒత్తిడి లాంటి వాటి వల్ల అందరూ వీలైనంత త్వరగా పదవీ విరమణ తీసుకునే ఆలోచన లో ఉన్నారు. మరి 50 ఏళ్లకే పదవీ విరమణ తీసుకుంటే, ఖర్చుల సంగతేంటి? మీరు సరైన ప్రణాళిక ప్రకారం పీపీఎఫ్ లో మదుపు చేస్తే ఇది మీరు త్వరగా పదవీ విరమణ తీసుకోవడానికి సహాయపడుతుంది. మీరు 25 ఏళ్ళ వయసు లో ఇందులో మదుపు చేయడం మొదలు పెట్టి 50 ఏళ్ళకి ముగించారనుకుందాం. రూ. 1 కోటి నిధి రావాలంటే నెల నెలా లేదా ఏడాదికి ఎంత మదుపు చేయాలి? దీని గురించి ఇప్పుడు కాస్త వివరంగా చూద్దాం.

రూ. 1 కోటి ఎలా?

పీపీఎఫ్ పై ప్రసూతానికి 8 శాతం చక్ర వడ్డీ అందుతోంది. దీని ప్రకారం 25 ఏళ్లలో రూ. 1 కోటి పొందాలంటే మీరు ఏడాదికి మదుపు చేయాల్సి మొత్తం రూ. 1,17,000 మాత్రమే. పీపీఎఫ్ పై వడ్డీ రేటు స్థిరంగా ఉండకపోవచ్చు. అయితే, ఇందులో కోట్లాది మంది మదుపు చేస్తారు కాబట్టి ప్రభుత్వం పెద్ద మొత్తం లో వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చు. ఈ ఖాతా లో మీరు ఏడాదికి రూ. 1.50 లక్షల వరకు మదుపు చేయవచ్చు. దీన్ని మీరు నెల నెలా లేదా ఒకేసారి కూడా మదుపు చేయవచ్చు. ఖాతా కొనసాగాలంటే ఏడాదికి కనీసం రూ.500 తప్పనిసరి.

పీపీఎఫ్ లెక్కింపు ఎలా?

మీరు కూడా మీరు మదుపు చేసే మొత్తం పై ఎంత రాబడి వస్తుందో తెలుసుకోవచ్చు. ఇది చాలా తేలిక కూడా. దీని కోసం బ్యాంకుల వెబ్సైట్లు లేదా నేరుగా పోస్ట్ ఆఫీస్ వెబ్సైటు లో కూడా సౌకర్యం ఉంది. మీరు వడ్డీ రేటు, మదుపు చేసే మొత్తం, కాల పరిమితి లాంటివి ఎంచుకుని సులభంగా సమకూర్చునే నిధిని తెలుసుకోవచ్చు.

పీపీఎఫ్ పాక్షిక ఉపసంహరణకు నిబంధనలు:

  1. పీపీఎఫ్ ఖాతాదారుడు ఏడేళ్ల తర్వాత ఏడాదికోసారి పాక్షికంగా డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు వీలుంది.
  2. సొమ్ము ఉపసంహరించుకుంటున్న ఏడాదికి నాలుగేళ్ల ముందు నాటి నగదు నిల్వలో 50 శాతం(లేదా) సొమ్ము ఉపసంహరించుకుంటున్న ఏడాదికి ముందు సంవత్సరం నాటి నగదు నిల్వలో 50 శాతం. ఇందులో ఏది తక్కువ మొత్తమైతే అంత మేర ఉపసంహరించుకోవచ్చు.
  3. పీపీఎఫ్ లో పాక్షిక ఉపసంహరణలకు పన్ను వర్తించదు.
  4. 15 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ పూర్తయ్యాక కూడా ఖాతాను ఎలాంటి డిపాజిట్ చేయకుండా కూడా కొనసాగించవచ్చు. ఖాతాలో ఉన్న నగదుపై ముగింపు వరకు వడ్డీ అందిస్తారు.
  5. 15 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా డిపాజిట్ చేస్తూ ఖాతాను కొనసాగించాలనుకుంటే 5 ఏళ్ల చొప్పున కొనసాగిస్తూ పోవాలి. ఈ ఐదేళ్ల కాలంలో ఒకసారి ఖాతాలోని నగదుకి 60 శాతానికి మించకుండా ఒకసారి విత్డ్రా చేసుకోవచ్చు.

పీపీఎఫ్ పై రుణం:

ఒకవేళ మీరు పీపీఎఫ్ ఖాతాపై రుణాలను పొందాలనుకుంటే, మీరు ఖాతాను తెరిచిన రోజు నుంచి మూడు సంవత్సరాల తరువాత మాత్రమే రుణం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. తీసుకున్న రుణాన్ని 36 నెలల్లో తిరిగి తీర్చవలసి ఉంటుంది. అలాగే సంవత్సరానికి ఒకసారి మాత్రమే రుణాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.

15 ఏళ్ళ తర్వాత:

పీపీఎఫ్ ఖాతా కాల పరిమితి 15 ఏళ్ళు. అయితే ఆ తర్వాత కూడా 5 ఏళ్ళ చొప్పున దీన్ని కొనసాగించుకోవచ్చు. అయితే, కొనసాగించాక అందులో కొత్తగా మదుపు చేయవచ్చు. కాబట్టి మీరు 15 ఏళ్ళ పాటు ప్రతి ఏడాది రూ. 1.50 లక్షలు మదుపు చేయడం మంచిది. ఫారం 15H ఇచ్చి 15 ఏళ్ళ తర్వాత కూడా మదుపు చేయవచ్చు, కానీ అందులో పన్ను మినహాయింపులు వర్తించవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని