IPO Listing: లిస్టింగ్‌లో మెరిసిన మోతీసన్స్‌ జువెలర్స్‌.. ఒక్కో లాట్‌పై రూ.13,522 లాభం

IPO Listing: మూడు కంపెనీల షేర్లు ఈరోజు తొలిసారి స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యాయి. దీంట్లో మోతీసన్స్‌ జువెలర్స్‌ మదుపర్లకు మంచి లాభాలను పంచింది.

Published : 26 Dec 2023 13:47 IST

ముంబయి: ఆభరణాల రిటైల్‌ విక్రయ కంపెనీ మోతీసన్స్‌ జువెలర్స్‌ షేర్లు లిస్టింగ్‌లో (Motisons Jewellers Listing) మెరిశాయి. ఇష్యూ ధర రూ.55తో పోలిస్తే 98 శాతం ప్రీమియంతో ట్రేడింగ్‌ ప్రారంభించడం విశేషం. బీఎస్‌ఈలో 88.90 శాతం లాభంతో రూ.103.90 దగ్గర షేర్లు లిస్టయ్యాయి. తర్వాత 93.34 శాతం పుంజుకొని రూ.109.09కి చేరాయి. ఎన్‌ఎస్‌ఈలో షేరు 98.18 శాతం భారీ ప్రీమియంతో రూ.109 దగ్గర అరంగేట్రం చేసింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ ఆరంభ ట్రేడింగ్‌లో రూ.994.30 కోట్లుగా నమోదైంది.

మోతీసన్స్‌ జువెలర్స్‌ ఐపీఓలో 159.61 రెట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రూ.151 కోట్ల సమీకరణ లక్ష్యంతో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన ఈ కంపెనీ షేరు ధరల శ్రేణిని రూ.52-55గా నిర్ణయించింది. షేర్లు అలాట్‌ అయినవారు కనీసం 250 షేర్లను కొనుగోలు చేశారు. ఈ లెక్కన వారు కనిష్ఠంగా రూ.13,750 ఇన్వెస్ట్‌ చేశారు. వారు ఒక్కో లాట్‌పై లిస్టింగ్‌లో రూ.13,522 లాభాన్ని ఆర్జించారు.

  • సూరజ్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ లిమిటెడ్‌ షేర్లు సైతం మంగళవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యాయి (Suraj Estate Developers Listing). ఇష్యూ ధర రూ.360తో పోలిస్తే షేర్లు 5.88 శాతం నష్టంతో ఎన్‌ఎస్‌ఈలో రూ.340 దగ్గర ట్రేడింగ్‌ ప్రారంభించాయి.
  • ముత్తూట్‌ మైక్రోఫిన్‌ (Muthoot Microfin Listing) లిమిటెడ్‌ షేర్లు ఇష్యూ ధర రూ.291తో పోలిస్తే ఎన్‌ఎస్‌ఈలో 5.39 శాతం నష్టపోయి రూ.275.30 దగ్గర ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని