Mukesh Ambani: ముకేశ్‌ అంబానీకి మళ్లీ మళ్లీ బెదిరింపులు

Mukesh Ambani: ముకేశ్‌ అంబానీకి బెదిరింపు మెయిల్స్‌ కొనసాగుతున్నాయి. గతంలో మాదిరిగానే అక్టోబర్‌ 31, నవంబర్‌ 1న మరో రెండు మెయిల్స్‌ వచ్చాయని పోలీసులు వెల్లడించారు.

Updated : 04 Nov 2023 16:35 IST

Mukesh Ambani | ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీకి (Mukesh ambani) బెదిరింపు మెయిల్స్‌ కొనసాగుతున్నాయి. అడిగినంత ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ తాజాగా ఆ మెయిల్స్‌లో నిందితుడు పేర్కొన్నాడు. గతంలో మెయిల్‌ చేసిన షాదాబ్‌ ఖాన్‌ అనే వ్యక్తి నుంచే ఈ సారి కూడా మెయిల్స్‌ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అక్టోబర్‌ 31, నవంబర్‌ 1న ఈ రెండు మెయిల్స్‌ వచ్చినట్లు తెలిపారు.

మెరుగైన సౌకర్యాలతో రైల్వే స్టేషన్‌లోనే రూమ్‌.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే..?

ముకేశ్‌ అంబానీకి తొలుత అక్టోబర్‌ 27న ఓ మెయిల్‌ వచ్చింది. రూ.20 కోట్లు ఇవ్వాలని, లేకపోతే ముకేశ్‌ అంబానీని అంతమొందిస్తామని అందులో నిందితుడు పేర్కొన్నాడు. ఆ తర్వాత మరో  రెండు సందర్భాల్లోనూ ఈ తరహా మెయిల్స్‌ వచ్చాయి. తొలుత రూ.20 కోట్లు ఇవ్వాలని పేర్కొన్న నిందితుడు.. ఆ మొత్తాన్ని, రూ.200 కోట్లకు, తర్వాత రూ.400 కోట్లకు పెంచేశాడు. మెయిల్స్‌కు స్పందించకపోవడంతో ప్రతిసారీ ఆ మొత్తాన్ని దుండగుడు పెంచుకుంటూ పోతున్నాడని పోలీసులు తెలిపారు. ముకేశ్‌ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్తుతెలియని వ్యక్తిపై ముంబయి పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గతేడాది సైతం ఇలానే అంబానీని, ఆయన కుటుంబాన్ని అంతమొందిస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు రిలయన్స్‌ ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న హాస్పిటల్‌కు ఫోన్‌ చేసి బెదిరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని