Cryptocurrency: క్రిప్టోకరెన్సీని ప్రవేశపెట్టే ఆలోచన లేదు: కేంద్రం

ప్రభుత్వం తరఫున క్రిప్టోకరెన్సీని ప్రవేశపెట్టే యోచనేమీ లేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి తెలిపారు....

Published : 15 Mar 2022 18:06 IST

దిల్లీ: ప్రభుత్వం తరఫున క్రిప్టోకరెన్సీని ప్రవేశపెట్టే యోచనేమీ లేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి తెలిపారు. ప్రస్తుతం దేశంలో క్రిప్టోకరెన్సీలపై ఎలాంటి నియంత్రణా లేదని స్పష్టం చేశారు. రాజ్యసభలో సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆర్‌బీఐ ఎలాంటి క్రిప్టోకరెన్సీలను జారీ చేయడం లేదని మంత్రి తెలిపారు. ఆర్‌బీఐ చట్టం 1994 ప్రకారం సంప్రదాయ కాగితపు కరెన్సీని మాత్రమే కేంద్ర బ్యాంకు జారీ చేస్తోందని స్పష్టం చేశారు. ఈ కాగితపు కరెన్సీకే త్వరలో డిజిటల్‌ రూపం ఇవ్వబోతున్నట్లు.. దాన్ని ‘సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (CBDC)’గా పేర్కొంటున్నట్లు తెలిపారు.

ఈ సీబీడీసీని దశలవారీగా ప్రవేశపెట్టేందుకు ఆర్‌బీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పంకజ్ చౌధరి తెలిపారు. నగదుపై ఆధారపడడాన్ని తగ్గించడం, తక్కువ లావాదేవీల ఖర్చు, నోట్ల ముద్రణ ఖర్చు తగ్గడం వంటి ప్రయోజనాలు కూడా సీబీడీసీ వల్ల ఉన్నాయని వివరించారు. గత కొంత కాలంగా నోట్ల ముద్రణ తగ్గిందని తెలిపారు. 2020-21లో రూ.4,378 కోట్లు విలువ చేసే నోట్లను ముద్రిస్తే.. ప్రస్తుతం అది రూ.4,012 కోట్లకు తగ్గిందని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని