Prepaid Plans: బడ్జెట్‌ ధరలో రోజూ 1జీబీ డేటా కావాలా?ఈ ప్లాన్లను పరిశీలించొచ్చు..!

బడ్జెట్‌ ధరలో రోజూ 1 జీబీ డేటా పొందాలనుకునే వారు ఈ ప్లాన్లను పరిశీలించొచ్చు.....

Published : 30 Apr 2022 17:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లోని మూడు ప్రైవేట్‌ టెలికాం సంస్థలు రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ తమ చందాదారుల కోసం అనేక ప్రీపెయిడ్‌ ప్లాన్లను అందిస్తున్నాయి. వీటిలో రోజువారీ డేటా ప్యాక్‌లకు భారీ ఆదరణ ఉంటుంది. ఒకవేళ మీరు తక్కువ ధరలో ఇలాంటి ప్లాన్లను తీసుకోవాలనుకుంటే మాత్రం చాలా పథకాలే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా బడ్జెట్‌ ధరలో రోజూ 1 జీబీ డేటా పొందాలనుకునే వారు ఈ ప్లాన్లను పరిశీలించొచ్చు..


రిలయన్స్‌ జియో..

📱 రూ.149: రోజుకి 1జీబీ డేటా, కాలపరిమితి 20 రోజులు, అపరిమిత కాల్స్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు

📱 రూ.179: రోజుకి 1జీబీ డేటా, కాలపరిమితి 24 రోజులు, అపరిమిత కాల్స్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు

📱 రూ.209: రోజుకి 1జీబీ డేటా, కాలపరిమితి 28 రోజులు, అపరిమిత కాల్స్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు

👉 పై ప్లాన్‌లలో జియో సినిమా, జియో టీవీ వంటి మరికొన్ని జియో యాప్స్‌ వినియోగానికి కూడా అనుమతి లభిస్తుంది.


భారతీ ఎయిర్‌టెల్‌..

📱 రూ.209: రోజుకి 1జీబీ డేటా, కాలపరిమితి 21 రోజులు, అపరిమిత కాల్స్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు

📱 రూ.239: రోజుకి 1జీబీ డేటా, కాలపరిమితి 24 రోజులు, అపరిమిత కాల్స్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు

📱 రూ.265: రోజుకి 1జీబీ డేటా, కాలపరిమితి 28 రోజులు, అపరిమిత కాల్స్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు

👉 పై ప్లాన్లతో వింక్‌ మ్యూజిక్‌, మొబైల్‌ ఎడిషన్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఫ్రీ ట్రయల్‌ కూడా లభిస్తుంది.


వొడాఫోన్‌ ఐడియా..

📱 రూ.199: కాలపరిమితి 18 రోజులు, అపరిమిత కాల్స్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు, రోజుకి 1జీబీ డేటా

📱 రూ.219: కాలపరిమితి 21 రోజులు, అపరిమిత కాల్స్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు, రోజుకి 1జీబీ డేటా

📱 రూ.239: కాలపరిమితి 24 రోజులు, అపరిమిత కాల్స్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు, రోజుకి 1జీబీ డేటా

📱 రూ.269: కాలపరిమితి 28 రోజులు, అపరిమిత కాల్స్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు, రోజుకి 1జీబీ డేటా

👉 ఒక్క రూ.239 ప్లాన్‌లో తప్ప మిగిలిన వాటిలో వీఐ మూవీస్‌, టీవీ వినియోగానికి అనుమతి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు