matrimony: ఐఏఎస్‌, ఐపీఎస్‌ కాదట.. మ్యాట్రిమొనీ సైట్‌లో వెతికింది వీరి కోసమేనట..!

స్టార్టప్‌ వ్యవస్థాపకుడి కోసం ఎక్కువగా శోధిస్తున్నారని కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అన్నారు.

Updated : 06 Jul 2022 08:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమ్మాయి పెళ్లనగానే కాబోయే వరుడిది ప్రభుత్వ ఉద్యోగమా? కాదా?అని తల్లిదండ్రులు ఆరా తీస్తుంటారు. ప్రతి మ్యాట్రిమొనీ సైట్‌ సెర్చ్‌ రిజల్ట్స్‌లో దాదాపు ఎక్కువగా ఇవే కనిపిస్తుంటాయి. తాజాగా ఈ ట్రెండ్‌ మారిందంటున్నారు కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌. ఇప్పుడంతా స్టార్టప్‌ వ్యవస్థాపకుడి కోసం ఎక్కువగా శోధిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రముఖ మ్యాట్రిమొనీ వెబ్‌సైట్‌ షాదీ.కామ్‌లో ఈ విధంగా ఆరా తీశారంటూ ఆయన చెప్పుకొచ్చారు.

గుజరాత్‌లో నిర్వహించిన డిజిటల్‌ ఇండియా వీక్‌ కార్యక్రమంలో భాగంగా రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. స్టార్టప్‌ ఉద్యోగి, స్టార్టప్‌ వ్యవస్థాపకుడు పదాలు షాదీ.కామ్‌ వెబ్‌సైట్‌లో ఎక్కువ సెర్చ్‌ చేసిన జాబితాలో ఉన్నాయని, ఐఏఎస్‌, ఐపీఎస్‌ గురించి కాకుండా వీటి గురించే ఎక్కువ వెతికారని చెప్పారు. విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని  తెలిపాయని పేర్కొన్నారు. అయితే, ఈ విషయంలో కేంద్రమంత్రి సరదాగా అన్నారో, నిజంగా అన్నారో మాత్రం తెలియరాలేదు. ఆయన చేసిన వ్యాఖ్యలను ఓ వ్యక్తి ట్వీట్‌ చేయగా.. దాన్ని రీట్వీట్‌ చేస్తూ ‘సరదా కోసం’ అని ఆయన ఎమోజీలు పెట్టారు. దీనిబట్టి డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్టార్టప్‌లను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని అర్థమవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని