Scam alert: కొత్త మోసం! చలాన్‌ పేరిట మెసేజులు.. క్లిక్‌ చేస్తే అంతే!

E-challan scam: ఇ-చలాన్‌ల పేరిట సైబర్‌ నేరగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. లింకులు పంపించి ప్రజల నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు.

Published : 30 Aug 2023 16:24 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. సందర్భాలను బట్టి కొత్త పంథాల్లో జనాల నుంచి డబ్బులు కొట్టేస్తున్నారు. ఇటీవల కాలంలో ట్రాఫిక్‌ చలాన్‌లకు సంబంధించి ఇ- చలాన్‌ల (E-Challan Scam) పేరిట కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. వాహనదారులకు వ్యక్తిగత సందేశాలు పంపించి డబ్బులు కొట్టేస్తున్నారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా (Scam alert) ఉండాలని ప్రభుత్వ, పోలీసు వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

ఇటీవల కాలంలో సైబర్‌ నేరగాళ్లు (Cyber fraudsters)ఇ-చలాన్‌ల పేరిట వ్యక్తులకు సందేశాలు పంపుతున్నారు. అందులోనే ఓ పేమెంట్‌ లింక్‌ను కూడా ఉంచుతున్నారు. ఎవరైనా నిజమేనని నమ్మి ఆ లింక్‌ను లింక్‌ క్లిక్‌ చేస్తే బ్యాంకు ఖాతా వివరాలను హ్యాక్‌ చేసి అందులోని డబ్బులును కొట్టేస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి సందేశాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

తక్కువ ధరకే విమాన టికెట్‌ పొందేలా.. గూగుల్‌లో కొత్త ఫీచర్లు!

సాధారణంగా చలాన్‌ల పేరిట వచ్చే మెసేజుల్లో వాహనం నంబర్‌, ఇంజిన్‌, ఛాసిస్‌ నంబర్‌ వంటి వివరాలు ఉంటాయి. సైబర్‌ నేరగాళ్లు పంపించే వాటిలో ఆ వివరాలు ఏవీ ఉండవు. అలాగే, ఇలాంటి సందేశాలు సెల్‌ఫోన్‌ నంబర్ల నుంచి రావనేది గుర్తుంచుకోవాలని పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి సందేశాలు వచ్చేటప్పుడు తొలుత అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి ఓ సారి తనిఖీ చేసుకోవాలని సూచిస్తున్నారు. చలాన్‌లకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌ను (https://echallan.parivahan.gov.in) పోలిన వెబ్‌సైట్లతో ఈ మోసాలకు పాల్పడుతుంటారని, కాబట్టి ఇలాంటి సందేశాలు వచ్చేటప్పుడు ఆ లింకులను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్తున్నారు. ఒకవేళ సైబర్‌ నేరానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్‌ చేయాలి. సంబంధిత బ్యాంకుకు కూడా సమాచారం ఇవ్వాలి. తర్వాత పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని