పీఎంవీవీవై vs పీఓఎంఐఎస్ vs ఎస్సీఎస్ఎస్...

పీఎంవీవీవై పథకం 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది.....

Published : 24 Dec 2020 13:38 IST

పీఎంవీవీవై పథకం 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది

ప్రధాన్ మంత్రి వయ వందన యోజన (పీఎంవీవీవై) పై వడ్డీ రేటును తగ్గించడంతో, స్థిర-ఆదాయ పెట్టుబడులపై పెట్టుబడులు పెట్టేవారికి పరిమిత ఆప్షన్స్ మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ఆర్బీఐ రెపో రేటును తగ్గించడంతో, చాలా బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటును ఇప్పటికే తగ్గించాయి, ఇది సీనియర్ సిటిజన్లపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. రిటైర్డ్ ఇన్వెస్టర్లకు సాధారణ ఆదాయ ప్రవాహం అవసరం, అలాగే మరికొందరు ఇన్వెస్టర్లు కూడా కేవలం సురక్షితమైన పెట్టుబడి పథకాల కోసం మాత్రమే కాకుండా నెలవారీ, త్రైమాసిక లేదా అర్ధ-వార్షిక వడ్డీ ఆదాయాన్ని అందించే పెట్టుబడుల కోసం చూస్తారు.

అలాంటి వారి అవసరాలకు తగిన మూడు పెట్టుబడులు ఇక్కడ ఉన్నాయి. అవి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), ప్రధాన్ మంత్రి వయ వందన యోజన (పీఎంవీవీవై), పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం (ఎంఐఎస్). అనేక ప్రముఖ బ్యాంకులు తక్కువ రాబడిని అందిస్తున్నందున బ్యాంకు ఎఫ్‌డీలను పరిగణలోకి తీసుకోవడం లేదు, అలాగే పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లను కూడా పరిగణించడం లేదు, ఎందుకంటే అవి వార్షిక వడ్డీ చెల్లింపులను మాత్రమే అందిస్తున్నాయి.

ప్రధాన్ మంత్రి వయ వందన యోజన (పీఎంవీవీవై)

ఇటీవల ప్రభుత్వం ప్రధాన్ మంత్రి వయ వందన యోజన (పీఎంవీవీవై) ను సవరించి, మరో మూడు ఆర్థిక సంవత్సరాలు అనగా మార్చి 2023 వరకు పొడిగించింది. సవరించిన పీఎంవీవీవైలో ప్రభుత్వం నెలవారీ 7.4 శాతం వడ్డీ రేటును ప్రకటించింది.

పీఎంవీవీవై పథకం 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. పీఎంవీవీవై అనేది సీనియర్ సిటిజన్లకు అందించే పెన్షన్ పథకం, ఇది నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా 10 సంవత్సరాల కాలానికి వార్షిక ప్రాతిపదికన హామీతో కూడిన రాబడిని అందిస్తుంది. పీఎంవీవీవైలో పెట్టుబడులు పెట్టడానికి ఎల్‌ఐసీని సంప్రదించాలి.

పీఎంవీవీవైలో చేయగలిగే గరిష్ట పెట్టుబడి సీనియర్ సిటిజన్‌కు రూ .15 లక్షలుగా ఉంది, అలాగే పీఎంవీవీవైలో గరిష్ట నెలవారీ పెన్షన్ సీనియర్ సిటిజన్‌కు రూ. 9250. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ 60 ఏళ్లు పైబడిన వారు అయితే, గరిష్టంగా నెలవారీ పెన్షన్ రూ. 30 లక్షల పెట్టుబడితో రూ. 18,500 పెన్షన్ పొందవచ్చు. పీఎంవీవీవైలోని పెన్షన్ పెట్టుబడిదారుడి వయస్సుపై ఆధారపడి ఉండదు.

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం (పీఓఎంఐఎస్)

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం 5 సంవత్సరాల కాలపరిమితితో లభిస్తుంది. ప్రస్తుతం, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం పై వడ్డీ రేటు నెలకు 6.6 శాతంగా ఉంది. ఒకే పేరుతో పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీంలో గరిష్ట పెట్టుబడి రూ. 4.5 లక్షలు కాగా, ఉమ్మడి పేరు మీద రూ. 9 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీంలో పన్ను ప్రయోజనం లేదు.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)

ఎస్సీఎస్ఎస్ లో హామీ రాబడి 5 సంవత్సరాలు. అయితే, ఎస్సీఎస్ఎస్ ను మెచ్యూరిటీ తర్వాత 3 సంవత్సరాలు పొడిగించవచ్చు, కానీ ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు వర్తిస్తుంది. ప్రస్తుతం, ఎస్సీఎస్ఎస్ పై వడ్డీ రేటు సంవత్సరానికి 7.4 శాతంగా ఉంది. దీనిని త్రైమాసిక ప్రాతిపదికన చెల్లిస్తారు. పెట్టుబడి సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనంతో వస్తుంది. 60 ఏళ్లు పైబడిన వారు మాత్రమే ఎస్సీఎస్‌ఎస్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు, ఈ సీనియర్ సిటిజన్ డిపాజిట్ పథకంలో గరిష్ట పెట్టుబడి మొత్తం రూ .15 లక్షలుగా ఉంది.

ఏం చేయాలి?

ఈ మూడు పెట్టుబడులకు ప్రభుత్వ మద్దతు ఉన్నందున ఇవి చాలా సురక్షితమైనవి. పీఎంవీవీవై, పీఓ ఎంఐఎస్, ఎస్సీఎస్ఎస్ నుంచి సంపాదించిన వడ్డీ ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. అత్యధిక వడ్డీ రేటు కోసం ఒకే ఒక పథకంలో పెట్టుబడులు పెట్టడానికి బదులుగా, సీనియర్ సిటిజన్లు సాధారణ ఆదాయ అవసరాన్ని, పన్నును, ద్రవ్యతను పరిగణనలోకి తీసుకున్న తరువాత ఈ మూడు పెట్టుబడులలో పెట్టుబడి పెట్టడానికి నిర్ణయించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని