Stock Market: మిశ్రమంగా మొదలైన మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మిశ్రమంగా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

Updated : 06 Jul 2023 09:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలపై అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు పడ్డాయి. దీంతో గురువారం ఉదయం సూచీలు ఊగిసలాట ధోరణి కనబరుస్తున్నాయి. 9.19 సమయంలో సెన్సెక్స్‌ 29 పాయింట్ల నష్టంతో 65,416 వద్ద, నిఫ్టీ 4 పాయింట్ల లాభంతో 19,402 వద్ద ట్రేడవుతున్నాయి. డీసీబీ బ్యాంక్‌, ఐనాక్స్‌ విండ్‌, కేఈసీ ఇంటర్నేషనల్‌, డిష్‌టీవీ షేర్లు లాభాల్లో ఉండగా.. సుజ్లాన్‌ ఎనర్జీ, రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, అజంతా ఫార్మా, స్టార్‌హెల్త్‌ అండ్‌ అలైడ్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. 

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 23 పైసలు కుంగి 82.37 వద్ద మొదలైంది. ఆసియా మార్కెట్లు మొత్తం నష్టాల్లోనే ట్రేడింగ్‌ అవుతున్నాయి. చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్‌ ఇండెక్స్‌ 0.36శాతం, హాంకాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్‌ 2.57శాతం, ఆస్ట్రేలియాకు చెందిన ఏఎస్‌ఎక్స్‌ 1.06శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.22శాతం, తైవాన్‌కు చెందిన టీఎస్‌ఈసీ 50 సూచీ 1.21శాతం విలువ కోల్పోయాయి. ఇక అమెరికా మార్కెట్లు కూడా నిన్న నష్టాల్లోనే ట్రేడింగ్‌ను ముగించాయి. డోజోన్స్‌ 0.38 శాతం, నాస్‌డాక్‌ 0.18, ఎస్‌అండ్‌పీ 500 సూచీ 0.2శాతం కుంగాయి.

భారత సేవల రంగ వృద్ధి జూన్‌లో 3 నెలల కనిష్ఠానికి మందగించినా.. సానుకూలంగానే ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా నెలవారీ సర్వే వెల్లడించింది. పీఎంఐ వ్యాపార కార్యకలాపాల సూచీ ఈ ఏడాది మే నెలలో 61.2 పాయింట్లు  కాగా, గత నెలలో 58.5 పాయింట్లకు తగ్గడం కూడా సూచీలపై ప్రభావం చూపింది.

రైట్స్‌ ఇష్యూ ద్వారా నిధులను సమీకరించేందుకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీ) సన్నాహాలు చేసుకుంటోంది. వివిధ ప్రాజెక్టులకు అవసరమయ్యే మూలధనం కోసం రైట్స్‌ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించే ప్రతిపాదనను పరిశీలించేందుకు ఈనెల 7న డైరెక్టర్ల బోర్డు సమావేశం జరుగుతుందని ఎక్స్ఛేంజీలకు ఐఓసీ తెలియజేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని