Solo travellers: ‘సోలో ట్రావెల్‌ సో బెటరు’.. ఆ దేశాల్లో ‘ఒంటరి’ పర్యటనకు భారతీయుల మొగ్గు

యూఏఈ, ఈజిప్టు, సింగపుర్‌, వియత్నాం వంటి దేశాలకు ఒంటరిగా వెళ్లేందుకు భారతీయులు మొగ్గు చూపుతున్నారని తాజా నివేదిక వెల్లడించింది.

Published : 10 Apr 2024 00:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విదేశీ పర్యటనకు వెళ్తోన్న భారతీయుల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈక్రమంలో పలు దేశాలకు ఒంటరిగా వెళ్లేందుకు భారతీయ పురుషులు ఆసక్తి చూపుతున్నారట. ముఖ్యంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE), ఈజిప్టు, సింగపుర్, వియత్నాం దేశాలకు వెళ్తున్నవారిలో వీరి సంఖ్య ఎక్కువగా ఉందని తాజా నివేదిక వెల్లడించింది. వీసాల కోసం వస్తోన్న దరఖాస్తుల్లో అధిక భాగం ఇవేనని ఈ-వీసా దరఖాస్తు ప్రక్రియ చేపట్టే ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ వేదిక ‘అట్లిస్‌’ పేర్కొంది.

బృందాలుగా పర్యటించే విషయానికొస్తే ఈ-వీసా దరఖాస్తుల్లో యూఏఈకి 20 శాతం, ఈజిప్టునకు 30 శాతం, సింగపూర్‌కు 25 శాతం, వియత్నాంకు సంబంధించినవి 20 శాతం ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. అదే ఒంటరిగా వెళ్లేందుకుగానూ వచ్చిన దరఖాస్తుల్లో యూఏఈకి 65 శాతం, ఈజిప్టు 60 శాతం, సింగపుర్‌కు 40 శాతం, వియత్నాంకు 45 శాతం ఉన్నాయని తెలిపింది. యూఏఈకి 77 శాతం, సింగపూర్‌కు 71 శాతం పురుషుల నుంచే వచ్చాయని అట్లిస్‌ వెల్లడించింది. సింగపూర్‌కు 30 శాతం, యూఏఈకి 25 శాతం దరఖాస్తులను మహిళలు చేసుకున్నారని తెలిపింది.

‘కుష్‌’ కోసం సమాధులు తవ్వుతున్నారు.. చేసేదిలేక ఎమర్జెన్సీ!

బెంగళూరు, ముంబయి, దిల్లీ, హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌ వెళ్లేందుకు ఎక్కువగా పర్యటకులు ఆసక్తి చూపుతున్నారట. వియత్నాం కోసం వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువగా బెంగళూరు, ముంబయి, దిల్లీ నగర వాసుల నుంచి వచ్చినట్లు తాజా నివేదిక తెలిపింది. సింగపుర్‌, ఈజిప్టులకు బెంగళూరు, ముంబయి, దిల్లీల నుంచి ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని పేర్కొంది. ఈ-వీసా దరఖాస్తు ప్రక్రియను చేపట్టే ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ వేదిక ‘అట్లిస్‌’.. ఈ వేసవిలో విదేశాలకు పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్న వారి వీసా దరఖాస్తుల ఆధారంగా ఈ నివేదిక రూపొందించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు