stock markets: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు..

స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.

Updated : 21 Jul 2023 09:44 IST

ముంబయి : అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ఆరు రోజుల వరుస లాభాలకు బ్రేకులు వేసింది. దేశీయ స్టాక్‌మార్కెట్‌(stock markets) సూచీలు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 19,800 దిగువన ప్రారంభం కాగా.. ఆరంభంలో ఒక దశలో సెన్సెక్స్‌ 700 పాయింట్లు కుంగింది. ఉదయం 9.20 నిమిషాలకు సెన్సెక్స్‌ 578 పాయింట్ల నష్టంతో 66,993 వద్ద.. 153 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 19826 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 82.03 వద్ద మొదలైంది. వారాంతం కావడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడం కూడా సూచీల కుంగుబాటుకు కారణంగా నిలిచింది. దీంతోపాటు సూచీల్లో అత్యంత ప్రాధాన్యమున్న ఇన్ఫోసిస్‌ షేరు భారీగా కుంగడం కూడా నష్టాలకు ఆజ్యం పోసింది.  

నిఫ్టీలో ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, విప్రో, ఎల్‌టీఐమైండ్‌ట్రీ షేర్లు నష్టపోతుండగా.. ఎల్‌అండ్‌టీ, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, నెస్లే ఇండియా, ఎస్‌బీఐ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభాలను నమోదు చేస్తున్నాయి.

ఆసియా-పసిఫిక్‌ ప్రధాన సూచీల్లో చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్‌ ఇండెక్స్‌, హాంకాంగ్‌ సూచీ మినహా మిగిలినవి మొత్తం నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు నిన్న మిశ్రమంగా ట్రేడింగ్‌ను ముగించాయి. డోజోన్స్‌ లాభాల్లో ముగియగా.. నాస్‌డాక్‌, ఎస్‌అండ్‌పీ-500 సూచీలు నష్టపోయాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని