ఓటర్ల కోసం ప్రత్యేక రాయితీ: అభిబస్‌

ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి బస్సు టిక్కెట్ల బుకింగ్‌లో ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు బస్‌ టికెట్‌ బుకింగ్‌ అగ్రిగేటర్‌, ఇగ్జిగో గ్రూపులో భాగమైన అభిబస్‌ వెల్లడించింది.

Updated : 01 May 2024 07:27 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి బస్సు టిక్కెట్ల బుకింగ్‌లో ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు బస్‌ టికెట్‌ బుకింగ్‌ అగ్రిగేటర్‌, ఇగ్జిగో గ్రూపులో భాగమైన అభిబస్‌ వెల్లడించింది. మంగళవారం సంస్థ సీఈఓ లెనిన్‌ కోడూరు, సీఓఓ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 11 నుంచి 15 తేదీల మధ్య చేసే ప్రయాణాలకు కూపన్‌ కోడ్‌ ABHIVOTE  (అభిఓట్‌) ఉపయోగించి, టికెట్‌ ధరలో కనీసం 20 శాతం నుంచి గరిష్ఠంగా రూ.250 వరకు రాయితీ పొందొచ్చని పేర్కొన్నారు. ఇదికాక రూ.100 క్యాష్‌బ్యాక్‌ కూడా లభిస్తుందన్నారు. సమ్మర్‌24 కూపన్‌ వినియోగించి, టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వారిలో రోజుకు ఒకరిని డ్రా ద్వారా ఎంపిక చేసి ఏసీ బహుమతిగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

ముందస్తు ప్రణాళికలు తగ్గుతున్నాయ్‌: గతంతో పోలిస్తే అదే రోజు బుకింగ్‌ చేసుకొని, ప్రయాణిస్తున్న వారి సంఖ్య ఇప్పుడు 10% పెరిగిందన్నారు. అభిబస్‌ దేశ వ్యాప్తంగా లక్ష బస్సులకు పైగా టిక్కెట్‌ బుకింగ్‌ సేవలను అందిస్తోంది. ఇప్పటికే ఐపీఓకి సంబంధించి సెబీకి ఇగ్జిగో దరఖాస్తు చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం డిసెంబరు వరకు ఇగ్జిగో రూ.497 కోట్ల ఆదాయంపై రూ.65 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. హైదరాబాద్‌ నుంచి గోవా, బెంగళూరు, తిరుపతి, షిరిడీ, విజయవాడలకు బస్సు టిక్కెట్లు అధికంగా కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. 2,000 ప్రైవేట్‌ బస్‌ ఆపరేటర్లతో పాటు, ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇటీవలే సినీనటులు మహేశ్‌బాబు, రాజేంద్ర ప్రసాద్‌లతో కలిసి ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించినట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని