రిటైల్‌ మదుపర్ల కోసం కార్పొరేట్‌ బాండ్ల ముఖ విలువ తగ్గింపు!

కార్పొరేట్‌ బాండ్‌ మార్కెట్లో రిటైల్‌ మదుపర్లు మరింతగా పాల్గొనడం కోసం ఆయా డెట్‌ సెక్యూరిటీల ముఖ విలువను ప్రస్తుత రూ.లక్ష నుంచి రూ.10,000కు తగ్గించాలన్న ప్రతిపాదనకు మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ ఆమోదించింది.

Published : 01 May 2024 03:44 IST

సెబీ బోర్డు సమావేశంలో పలు నిర్ణయాలు

దిల్లీ: కార్పొరేట్‌ బాండ్‌ మార్కెట్లో రిటైల్‌ మదుపర్లు మరింతగా పాల్గొనడం కోసం ఆయా డెట్‌ సెక్యూరిటీల ముఖ విలువను ప్రస్తుత రూ.లక్ష నుంచి రూ.10,000కు తగ్గించాలన్న ప్రతిపాదనకు మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ ఆమోదించింది. సెబీ బోర్డు సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలు ఇవే..

  • యూనిట్‌ ఆధారిత ఉద్యోగ ప్రయోజనాల(యూబీఈబీ)కు నిబంధనావళి రూపొందించనున్నారు. రీట్‌ లేదా ఇన్విట్‌ యూనిట్ల ఆధారంగా తమ ఉద్యోగులకు రీట్‌ మేనేజర్‌ లేదా ఇన్విట్‌ మేనేజర్‌లు యూబీఈబీ పథకాలను అందించొచ్చు. నీ నాన్‌-కన్వర్టబుల్‌ సెక్యూరిటీలను మాత్రమే నమోదు చేసిన సంస్థలకు.. వార్తా పత్రికల్లో ఆర్థిక ఫలితాల ప్రచురణకు సంబంధించి కొంత వెసులుబాటునూ కల్పించింది. తద్వారా నిబంధనలను పాటించేందుకయ్యే ఖర్చు తగ్గించనుంది.
  • రూ.10,000 ముఖ విలువతో ఎన్‌సీడీలు లేదా ఎన్‌సీఆర్‌పీఎస్‌లను ప్రైవేటు ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో జారీ చేసే ఆప్షన్‌ను కంపెనీలకు ఇచ్చే ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని