గూగుల్‌లో ఉద్యోగ కోతలు

టెక్‌ దిగ్గజం గూగుల్‌ తన ఫ్లటర్‌, డార్ట్‌, పైథాన్‌ బృందాల్లో లేఆఫ్‌లు ప్రకటించింది. ఉద్యోగ కోతలు కంపెనీ వ్యాప్తంగా జరగలేదని.. కేవలం ఆయా బృందాలకు మాత్రమే పరిమితమయ్యాయని గూగుల్‌ స్పష్టం చేసింది.

Published : 01 May 2024 03:43 IST

ఫ్లటర్‌, డార్ట్‌, పైథాన్‌ బృందాల్లో

టెక్‌ దిగ్గజం గూగుల్‌ తన ఫ్లటర్‌, డార్ట్‌, పైథాన్‌ బృందాల్లో లేఆఫ్‌లు ప్రకటించింది. ఉద్యోగ కోతలు కంపెనీ వ్యాప్తంగా జరగలేదని.. కేవలం ఆయా బృందాలకు మాత్రమే పరిమితమయ్యాయని గూగుల్‌ స్పష్టం చేసింది. వార్షిక డెవలపర్‌ కాన్ఫరెన్స్‌కు కొద్ది వారాల ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. లేఆఫ్‌నకు గురైన వారు కంపెనీలో ఇతర ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని గూగుల్‌ చెప్పినట్లు ఆంగ్ల వార్తా సంస్థ ఒకటి పేర్కొంది. కంపెనీ కొద్ది వారాల కిందట తన స్థిరాస్తి, ఆర్థిక విభాగాల్లోనూ లేఆఫ్‌లను ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరిలోనూ వందల మంది ఉద్యోగులను ఇంజినీరింగ్‌, హార్డ్‌వేర్‌, అసిస్టెంట్‌ బృందాల్లో గూగుల్‌ తొలగించింది. కృత్రిమ మేధ(ఏఐ) సామర్థ్యాలను పెంచుకోవడంపై కంపెనీ దృష్టి సారిస్తుండడం ఇందుకు నేపథ్యం.

బెంగళూరులో గ్రోత్‌ హబ్‌: బెంగళూరు, మెక్సికో, డబ్లిన్‌ వంటి నగరాల్లో ‘గ్రోత్‌ హబ్స్‌’ నిర్మించనున్నట్లు సిబ్బందికి పంపిన ఇ-మెయిల్‌లో గూగుల్‌ ఫైనాన్స్‌ చీఫ్‌ రూత్‌ పొరాట్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని