‘న్యుబెవాక్స్‌ 14’ టీకాపై క్లినికల్‌ పరీక్షల్లో సానుకూల ఫలితాలు

చిన్న పిల్లల్లో న్యుమోకాకల్‌ అనే వ్యాధిని నివారించేందుకు నిర్దేశించిన టీకాను ఆవిష్కరించడంలో హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ (బీఇ) కీలక మైలురాయిని చేరుకుంది.

Published : 01 May 2024 03:45 IST

బీఇ లిమిటెడ్‌

ఈనాడు, హైదరాబాద్‌: చిన్న పిల్లల్లో న్యుమోకాకల్‌ అనే వ్యాధిని నివారించేందుకు నిర్దేశించిన టీకాను ఆవిష్కరించడంలో హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ (బీఇ) కీలక మైలురాయిని చేరుకుంది. న్యుబెవ్యాక్స్‌ 14; (బీఇ- పీసీవీ-14) అనే న్యుమోకాకల్‌ కంజుగేట్‌ వ్యాక్సిన్‌పై మూడో దశ క్లినికల్‌ పరీక్షల్లో ఎంతో సానుకూల ఫలితాలు లభించినట్లు సంస్థ మంగళవారం ఇక్కడ వెల్లడించింది. ‘వ్యాక్సిన్‌’  పీర్‌- రివ్యూ జర్నల్‌లో ఈ పరీక్షల ఫలితాలు ప్రచురించినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా 15  ప్రదేశాల్లో  6 నుంచి 8 వారాల వయస్సు గల 1290 మంది పసికందులపై ఈ టీకా ప్రయోగాలు నిర్వహించారు. 6-10-14 వారాలకు ఒక డోసు చొప్పున ఇచ్చి ఫలితాలు విశ్లేషించారు. ఈ టీకా భద్రత నిర్థారణ జరిగి, వ్యాధిని నివారించగల సత్తాను ప్రదర్శించినట్లు బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ వెల్లడించింది. చిన్న పిల్లలకు ఈ టీకా ఇవ్వవచ్చని నిర్థారణ అయినందున, టీకాను విడుదల చేయడానికి దగ్గరయ్యామని బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ ఎండీ మహిమా దాట్ల వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని