టాటాసన్స్కు సుప్రీంకోర్టులో ఊరట
టాటాసన్స్కు నేడు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. గతంలో సైరస్ మిస్త్రీని తిరిగి ఛైర్మన్‌గా నియమించాలంటూ
ఇంటర్నెట్‌డెస్క్: టాటాసన్స్కు నేడు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. గతంలో సైరస్ మిస్త్రీని తిరిగి ఛైర్మన్‌గా నియమించాలంటూ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును నిలిపివేసింది. నేడు దీనిపై చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఏఎస్ బోపన్న,జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యం సభ్యులుగా ఉన్నారు. గతేడాది డిసెంబర్ 17న ఈ కేసులో తీర్పును రిజర్వులో ఉంచింది.
2016లో మిస్త్రీని ఛైర్మన్‌గా తొలగిస్తూ టాటాసన్స్ బోర్డు తీసుకొన్న నిర్ణయం చెల్లుబాటు కాదని 2019 డిసెంబర్ 18న ఎన్సీఎల్ఏటీ తీర్పు వెలువరించింది. మిస్త్రీని తిరిగి ఛైర్మన్‌గా నియమించాలని సూచించింది. దీంతో 2020 జనవరి 2వ తేదీన టాటాసన్స్ ఈ తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ఆ తర్వాత రతన్ టాటా కూడా ఎన్సీఎల్ఏటీ తీర్పును అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేశారు. అదేనెల 10వ తేదీన సుప్రీం కోర్టు ఎన్సీఎల్ఏటీ తీర్పుపై స్టే విధించింది. సెప్టెంబర్ 22న టాటాసన్స్లో షేర్లను షాపూర్జీ పల్లోంజీ సంస్థ ఎక్కడా తాకట్టు పెట్టకుండా న్యాయస్థానం అడ్డుకొంది. గతేడాది డిసెంబర్8న తుది వాదనలను విన్నది. అదే నెల 17న తీర్పును రిజర్వులో పెట్టింది. నేడు టాటాసన్స్ వాదనలను బలపరుస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
ఇవీ చదవండి
ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్ అదరహో
క్రిప్టోకరెన్సీలపై ఆందోళనలున్నాయ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్