Maruti Suzuki: మారుతీ సుజుకీ ఉత్పత్తికి చిప్‌ సెగ‌..!

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఆగస్టు ఉత్పత్తిపై చిప్‌ల కొరత ప్రభావం చూపింది. ఆ నెలలో ఉత్పత్తి దాదాపు 8శాతం తగ్గింది. చిప్స్‌ కొరత కారణంగా కేవలం 1,13,937 వాహనాలను మాత్రమే ఉత్పత్తి చేసింది.

Published : 08 Sep 2021 17:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఆగస్టు ఉత్పత్తిపై చిప్‌ల కొరత ప్రభావం చూపింది. ఆ నెలలో ఉత్పత్తి దాదాపు 8శాతం తగ్గింది. చిప్స్‌ కొరత కారణంగా కేవలం 1,13,937 వాహనాలను మాత్రమే ఉత్పత్తి చేయగలిగింది. గతేడాది కంపెనీ 1,23,796 కార్లను ఉత్పత్తి చేసింది. ‘‘ఎలక్ట్రానిక్‌ పరికరాల కొరత వల్ల  2021 ఆగస్టు నెల ఉత్పత్తి తగ్గింది’’ అని కంపెనీ పేర్కొంది.

ముఖ్యంగా ప్యాసింజర్‌ వాహనాల ఉత్పత్తిలోనే ఈ కోత కనిపించింది. గతేడాది ఇదే సీజన్‌లో 1,21,381 వాహనాలను ఉత్పత్తి చేయగా.. 1,11,368 వాహనాలను మాత్రమే ఆగస్టులో తయారు చేసింది. మినీ కార్లు ఆల్టో , ఎస్‌ ప్రెస్సోల తయారీలో దాదాపు 2వేల యూనిట్ల ఉత్పత్తి తగ్గింది. ఇక కాంపాక్ట్‌ కార్లైన వేగన్‌ ఆర్‌, సెలిరియో, ఇగ్నిస్‌, స్విఫ్ట్‌, బ్యాలినో, డిజైర్‌ల ఉత్పత్తిపై ఇది ఎక్కువగా ప్రతికూల ప్రభావం చూపింది. కానీ, ఎర్తిగా, ఎస్‌క్రాస్‌, జిప్సీ, ఎక్స్‌ఎల్‌6 వంటి యుటిలిటీ వాహనాల ఉత్పత్తి మాత్రం 9వేల యూనిట్లు పెరిగింది.

ఇక సెప్టెంబర్‌లో ఉత్పత్తిపై కూడా చిప్‌ల కొరత ప్రతికూల ప్రభావం చూపొచ్చని అంచనా వేస్తోంది. హరియాణా,  గుజరాత్‌లోని ప్లాంట్లలో కేవలం 40 శాతం మాత్రమే ఉత్పత్తి జరగొచ్చని చెబుతోంది. ఇప్పటికే మహీంద్ర సంస్థ కూడా ఉత్పత్తిలో కోత విధించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని