కొవిడ్‌ వచ్చింది.. కుబేరులను చేసింది..

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కరోనా వైరస్‌ ప్రభావంతో తల్లడిల్లిపోయాయి. పలు దేశాలు సంక్షోభంలో మునిగి ఇంకా కోలుకోలేని స్థితిలో ఉన్నాయి. కానీ

Published : 31 Dec 2020 20:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కరోనా వైరస్‌ ప్రభావంతో తల్లడిల్లిపోయాయి. పలు దేశాలు సంక్షోభంలో మునిగి ఇంకా కోలుకోలేని స్థితిలో ఉన్నాయి. కానీ ఇదే కొవిడ్‌-19 మహమ్మారి కొన్ని రంగాలకు చెందిన వారిని మాత్రం కొత్తగా బిలియనీర్ల జాబితాలోకి చేర్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరి ఇంతటి సంక్షోభ పరిస్థితుల్లో బిలియనీర్ల జాబితాలో చేరిన వారు ఎవరంటే.. అందులో శాస్త్రవేత్తలు, పరిశోధకులు, వైద్యులు, వైద్యారోగ్యానికి చెందిన పలువురు వ్యక్తులు ఉన్నారు. వారిలో కొందరి గురించి తెలుసుకుందాం. 

* ఫైజర్‌ టీకా బృందం: కరోనా వైరస్‌ను నివారించేందుకు జర్మనీకి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ ‘బయోఎన్‌ టెక్‌’ ఫైజర్ టీకాను రూపొందించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ టీకాకు పలు దేశాల్లో అత్యవసర ఆమోదం కూడా లభించింది. కాగా ఈ సంస్థ  వ్యవస్థాపకులు ఉగర్‌ సాహిన్‌ నికర ఆస్తి విలువ ఈ ఏడాది 4.2 బిలియన్‌ డాలర్లుగా రికార్డు సృష్టించింది. టర్కీ దేశానికి చెందిన సాహిన్‌ 2008లో తన భార్య ఓజ్లెమ్‌ టురెసీతో కలిసి బయోఎన్‌ టెక్‌ను స్థాపించారు. 

* మోడెర్నా టీమ్‌: మోడెర్నా సంస్థ సీఈవో స్టీఫెన్‌ బాన్సెల్‌ కూడా ఈ ఏడాది అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిన వారిలో ముందంజలో ఉన్నారు. ఆయన నికర సంపద విలువ 4.1బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ఆయనతో పాటు హార్వర్డ్‌, ఎంఐటీ వర్శిటీలకు చెందిన ప్రొఫెసర్లు టిమోతి స్ప్రింగర్‌ సంపద విలువ 2 బి.డాలర్లు, రాబర్ట్‌ లాంగర్‌ సంపద విలువ 1.5 బి.డాలర్లుగా నమోదైంది. 

* టీకా నిల్వ చేసేందుకు ఉపయోగించే గ్లాస్‌ బాటిల్స్‌ తయారీలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సంస్థ ‘స్టివనాటో’. ఈ గ్రూప్‌ అధ్యక్షుడు సెర్జియో స్టివనాటో సంపద విలువ ఈ ఏడాది 1.8 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇక మరొకరు.. వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో భాగంగా యాంటీ బాడీ పరీక్షలు చేసే ‘ల్యాబ్‌ మ్యాన్‌’ సంస్థ సీఈవో ఆగస్ట్‌ ట్రోండిల్‌. ఈ ఏడాది ట్రోండిల్‌ సంపద విలువ 1.3బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.

ఇదీ చదవండి

2020 నేర్పిన ఆర్థిక పాఠాలు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని