ట్విటర్‌ చేతికి బ్రేకర్‌..!

ప్రముఖ పాడ్‌కాస్ట్‌ యాప్‌ బ్రేకర్‌ ట్విటర్‌ చేతికి వెళ్లనుంది. త్వరలోనే దీనిని ట్విటర్‌ కొనుగోలు చేయనుంది. వచ్చే వారం నుంచి అది అందుబాటులో ఉండదు. ఈ విషయాన్ని బ్రేకర్‌ సీఈవో

Published : 05 Jan 2021 19:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ పాడ్‌కాస్ట్‌ యాప్‌ బ్రేకర్‌ ట్విటర్‌ చేతికి వెళ్లనుంది. త్వరలోనే దీనిని ట్విటర్‌ కొనుగోలు చేయనుంది. వచ్చే వారం నుంచి అది అందుబాటులో ఉండదు. ఈ విషయాన్ని బ్రేకర్‌ సీఈవో ఎరిక్‌ బెర్లి తన అధికారిక బ్లాగ్‌లో పేర్కొన్నారు. ‘మన వినియోగదారులకు విషాదకరమైన వార్త. శుక్రవారం నుంచి బ్రేకర్‌ను మూసివేస్తున్నాం. భవిష్యత్తులో తీసుకురానున్న వాటిపై దృష్టిపెట్టేందుకు ఇది సహకరిస్తుందని భావిస్తున్నాం. బ్రేకర్‌లో ఆడియో కమ్యూనికేషన్‌పై చాలా శ్రద్ధపెట్టాం. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తమ భావాలను తెలిపేందుకు ట్విటర్‌ అందించిన వేదికను చూసి స్ఫూర్తి పొందాం’’అని పేర్కొన్నారు.  ఎరిక్‌ బెర్లి బృందం ట్విటర్‌లో చేరింది.

ఇప్పటికే యాప్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసుకొన్న వారి సబ్‌స్క్రిప్షన్లను ఇతర పాడ్‌కాస్టింగ్‌ యాప్‌లకు బదిలీ చేయనున్నారు. వీటిల్లో యాపిల్‌ ఐఎన్‌ఎసీ, స్పోటిఫై వంటివి ఉండనున్నాయి. ట్విటర్‌ ఎంత సొమ్ముపెట్టి  బ్రేకర్‌ను కొనుగోలు చేయనుందో మాత్రం వెల్లడించలేదు.

ఇదీ చదవండి

జాక్‌మా ఎక్కడ? 

ఆడీ కొత్త కారు@రూ.42.34 లక్షలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని