బ్యాంకుల్లో పూచీక‌త్తు అంటే ఏంటి?

బ్యాంకులు పూచీకత్తుపై మాత్రమే రుణాలను అందజేస్తాయి. ఈ ఒప్పందంలో మూడు అంశాలు కీలకం. అప్పు ఇచ్చే సంస్థ(బ్యాంకు), అప్పు తీసుకునే వ్యక్తి(రుణ గ్రహీత), హామీగా ఉంచే వస్తువు. రెండు రకాల పూచీకత్తులపై బ్యాంకులు పనిచేస్తాయి. బ్యాంకులు పూచీకత్తుగా అంగీకరించేవి (వ్యక్తులు రుణాలు తీసుకున్నప్పుడు), బ్యాంకులే జా..

Published : 16 Dec 2020 16:40 IST

బ్యాంకులు పూచీకత్తుపై మాత్రమే రుణాలను అందజేస్తాయి. ఈ ఒప్పందంలో మూడు అంశాలు కీలకం. అప్పు ఇచ్చే సంస్థ(బ్యాంకు), అప్పు తీసుకునే వ్యక్తి(రుణ గ్రహీత), హామీగా ఉంచే వస్తువు. రెండు రకాల పూచీకత్తులపై బ్యాంకులు పనిచేస్తాయి. బ్యాంకులు పూచీకత్తుగా అంగీకరించేవి (వ్యక్తులు రుణాలు తీసుకున్నప్పుడు), బ్యాంకులే జారీ చేసేవి. బ్యాంకులు పూచీకత్తుగా అంగీకరించేవి - బ్యాంకులు రుణాలు ఇచ్చేముందు కొన్నింటిని సెక్యూరిటీగా తమ వద్ద ఉంచుకుంటాయి. రుణాలు మంజూరు చేసేటప్పుడు మూడో వ్యక్తి హామీని తీసుకుంటాయి. మూడో వ్యక్తి(థర్డ్‌పార్టీ) బ్యాంకుకు, రుణ గ్రహీతకు మధ్యవర్తిలా ఉండాల్సి వస్తుంది. ఒకవేళ రుణ గ్రహీత రుణం చెల్లించని పరిస్థితుల్లో మూడో వ్యక్తి ఆ బాధ్యతను నెరవేర్చాల్సి ఉంటుంది. ఉదాహరణకు ‘ఏ’ అనే కంపెనీ ‘బీ’, ‘సీ’ లు పూచీకత్తుగా ఉంటూ రూ. 10 లక్షల టర్మ్‌ లోన్‌ తీసుకుంది అనుకుందాం. ఇక్కడ బ్యాంకు రుణదాత, ‘ఏ’ ప్రధాన రుణ గ్రహీత. ‘బీ’ , ‘సీ’ లు పూచీకత్తుగా వ్యవహరించేవారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఏ రుణం చెల్లించకపోతే, ‘బీ’, ‘సీ’ లు ఆ బాధ్యతను నెరవేర్చాల్సి ఉంటుంది. యంత్రాలు, భవనాలు, భూములు వంటి వాటిని బ్యాంకులు పూచీకత్తుగా స్వీకరించేందుకు అంగీకరిస్తాయి.

బ్యాంకులే జారీ చేసేవి:

బ్యాంకు హామీగా మూడో వ్యక్తికి(వినియోగదారుడు) ఆర్థిక వ్యవహారాల్లో బ్యాంకు పూచీకత్తుగా వ్యవహరిస్తుంది. ఇలాంటి సమయాల్లో వినియోగదారుడు విఫలమైతే బ్యాంకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. బ్యాంకులు ఎక్కువగా వ్యాపార వర్గాల వారికే గ్యారెంటీని అందిస్తాయి.
ఈ రకం గ్యారెంటీలకు నిర్దేశిత కాలపరిమితి ఉంటుంది.

బ్యాంకు గ్యారెంటీలు సాధారణంగా పెద్ద సంస్థలు, చిన్న సంస్థలతో ఒప్పందం చేసుకునేటప్పుడు అవసరం అవుతూ ఉంటాయి. ఏదైనా ప్రాజెక్టును అప్పగించే చిన్న సంస్థలకు అప్పగించే సమయంలో పెద్ద సంస్థలు బ్యాంకు గ్యారెంటీని కోరతాయి. టెండర్లలో పాల్గొనేందుకు, గుత్తేదార్లు మొబిలైజేషన్‌ అడ్వాన్సులు పొందేందుకు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని