బీమా, పెట్టుబడిని రెండింటిని ఎందుకు కలపకూడదు?

సగటున 10 శాతం రాబడితో నెలకు రూ. 269 లను 35 సంవత్సరాల పాటు ​​ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టినట్లయితే, రూ. 9,14,274 మెచ్యూరిటీ విలువను పొందుతారు...

Updated : 01 Jan 2021 20:06 IST

సగటున 10 శాతం రాబడితో నెలకు రూ. 269 లను 35 సంవత్సరాల పాటు ​​ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టినట్లయితే, రూ. 9,14,274 మెచ్యూరిటీ విలువను పొందుతారు. ఒక వ్యక్తి బీమా, పెట్టుబడిని ఎందుకు కలపకూడదు. అలాగే పెన్షన్ ప్లాన్స్, ఎండోమెంట్ ప్లాన్స్, మనీ బ్యాక్ పాలసీలు లేదా యూలిప్ లను ఎందుకు కొనుగోలు చేయాలనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

న్యూ జీవన్ ఆనంద్ బెనిఫిట్ ఇల్లుస్ట్రేషన్
వయసు : 30 సంవత్సరాలు

పాలసీ టర్మ్ : 35 సంవత్సరాలు

హామీ మొత్తం : రూ .100000

ప్రీమియం : నెలకు రూ. 269 (ఎల్ఐసీ ప్రీమియం కాలిక్యులేటర్ ప్రకారం, ఎలాంటి సర్వీస్ టాక్స్ లేదు, ఎలాంటి రైడర్లు లేవు)

35 సంవత్సరాల తర్వాత హామీ ఇచ్చిన బెనిఫిట్ : రూ. 1,25,000

35 సంవత్సరాల తరువాత హామీ ఇవ్వని బెనిఫిట్ : రూ. 1,56,000 (8 శాతం రాబడి అంచనా)

35 సంవత్సరాల తర్వాత బోనస్ లేకుండా మొత్తం బెనిఫిట్ : రూ. 2,56,000

35 సంవత్సరాల తరువాత, ఒకవేళ పాలసీ హోల్డర్ చనిపోయినట్లయితే, రూ. 100,000 మొత్తాన్ని చెల్లిస్తారు.

మెచ్యూరిటీ సమయంలో హామీ మొత్తానికి రూ. 2,56,000 బోనస్ ను జత చేస్తారు.

ఇప్పుడు బోనస్ తో సహా మొత్తం మెచ్యూరిటీ విలువ = రూ. 2,56,000 + రూ. 2,56,000 = రూ. 5,12,000

మీరు సగటున 10 శాతం రాబడితో నెలకు రూ. 269 లను 35 సంవత్సరాల పాటు ​​ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టినట్లయితే, రూ. 9,14,274 మెచ్యూరిటీ విలువను పొందుతారు.
హామీ మొత్తం : రూ. 1,50,00,000, కాలవ్యవధి = 35 సంవత్సరాలు, నాన్ స్మోకర్ పురుషుడు, టర్మ్ బీమా వార్షిక ప్రీమియం ఎంత?
ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, మ్యాక్స్ లైఫ్ టర్మ్ బీమా వార్షిక ప్రీమియం సంవత్సరానికి రూ. 15,000 నుంచి 16,000 మధ్య ఉండవచ్చు. అదే ఎల్ఐసీ ఈ-టర్మ్ వార్షిక ప్రీమియం సుమారు రూ. 40,000 వరకు ఉంటుంది.

సమ్మరీ -1

న్యూ జీవన్ ఆనంద్ 

పెట్టుబడి : నెలకు రూ. 269​​, అదే సంవత్సరానికి అయితే రూ. 3228.

35 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ విలువ : రూ. 5,12,000

పాలసీ మెచ్యూరిటీ విలువ 2,56,000 x 3 = రూ. 7,68,000

ఒకవేళ పాలసీదారుడు మరణించినట్లైతే, రూ. 1,00,000 బీమా కవరేజ్ లభిస్తుంది.

మ్యూచువల్ ఫండ్ + టర్మ్ ప్లాన్ 

పెట్టుబడి : నెలకు రూ. 500, అంటే సంవత్సరానికి రూ. 6000.

35 సంవత్సరాల తర్వాత 10 శాతం వద్ద మెచ్యూరిటీ విలువ : రూ. 16,99,395

టర్మ్ బీమా ప్రీమియం : రూ. 40,000

సమ్మరీ -2

న్యూ జీవన్ ఆనంద్ 

పెట్టుబడి : సంవత్సరానికి రూ. 3228

35 సంవత్సరాల తరువాత, మీరు రూ. 7,68,000 పొందుతారు.

35 సంవత్సరాల తరువాత, పాలసీదారుడు మరణించినట్లైతే, నామినీ రూ. 100,000 పొందుతారు.

ఒకవేళ పాలసీ అమలులో ఉన్నప్పుడు పాలసీదారుడు మరణించినట్లైతే, హామీ ఇచ్చిన మొత్తానికి మూడు రెట్లు సమానమైన మొత్తాన్ని నామినీ పొందుతాడు.

ఉదాహరణకు, 22 సంవత్సరాల తర్వాత పాలసీదారుడు మరణించినట్లైతే, నామినీ రూ. 2,00,000 X 3 = రూ. 6,00,000 పొందుతాడు.

మ్యూచువల్ ఫండ్ + టర్మ్ ప్లాన్ 

మీ పెట్టుబడి రూ. 6000 + రూ. 42, 304 = సంవత్సరానికి రూ. 48,304

35 సంవత్సరాల తరువాత, మీరు రూ. 16,99,395 పొందుతారు.

ఒకవేళ పాలసీదారుడు 35 సంవత్సరాలలోపు చనిపోయినట్లైతే, నామినీ రూ. 1.5 కోట్లను పొందుతాడు.

ఒకవేళ 35 సంవత్సరాల తర్వాత పాలసీదారుడు చనిపోయినట్లైతే, నామినీకి ఎలాంటి మరణ ప్రయోజనం లభించదు.

ఒకవేళ పాలసీదారుడు 22 సంవత్సరాల తర్వాత చనిపోయినట్లైతే, నామినీ టర్మ్ పాలసీ నుంచి రూ. 1.5 కోట్లు, అలాగే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి నుంచి
రూ. 4,47,714 పొందుతారు.

ముగింపు : సాంప్రదాయ పాలసీలు, టర్మ్ ప్లాన్ + మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల మధ్య ఎలాంటి పోలిక లేదు. ఇక్కడ గమనించవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, పాలసీదారుడు మరణించినప్పుడు నామినీకి లభించే మొత్తం. ఇది అతని మొత్తం కుటుంబానికి సరిపోవడంతో పాటు వారి ఖర్చులను, లక్ష్యాలను చేరుకోవడానికి వారికి సహాయపడుతుంది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని