Wipro: విప్రో చేతికి మూడు సబ్బుల బ్రాండ్లు

విప్రో కన్జూమర్‌ సంస్థ మూడు సబ్బుల బ్రాండ్లను సొంతం చేసుకుంది. జో, డోయ్‌, బాక్టీర్‌ షీల్డ్‌ బ్రాండ్లను తాజాగా కొనుగోలు చేసింది.

Published : 05 Dec 2023 20:52 IST

దిల్లీ: విప్రో కన్జూమర్‌ కేర్‌ అండ్‌ లైటింగ్‌ సంస్థ తన వ్యాపారాన్ని విస్తరిస్తోంది. ఇందులో భాగంగా జో, డోయ్‌, బాక్టీర్‌ షీల్డ్‌ సోప్‌ బ్రాండ్లను వీవీఎఫ్‌ (ఇండియా) నుంచి కొనుగోలు చేసింది. ఎంత మొత్తానికి కొనుగోలు చేసిందీ వెల్లడి కాలేదు. పర్సనల్‌ వాష్‌ సెగ్మెంట్‌లో వ్యాపార విస్తరణకు ఈ కొనుగోళ్లు కలిసొస్తాయని కంపెనీ భావిస్తోంది. గడిచిన 12 నెలల్లో   మూడు కంపెనీలను విప్రో కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు 15 కొనుగోళ్లు పూర్తి చేసింది.

దేశంలో ఎక్కువగా అమ్ముడయ్యే సబ్బుల్లో ఒకటైన సంతూర్‌ పేరుతో విప్రో ఇప్పటికే సోప్స్‌ను విక్రయిస్తోంది. తాజా కొనుగోళ్లు పర్సనల్‌ వాష్‌ సెగ్మెంట్‌లో వ్యూహాత్మకంగా విప్రోకు ఉపయోగపడతాయని ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలపింది. జో, డోయ్‌, బాక్టీర్‌ షీల్డ్‌ బ్రాండ్లు 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.210 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా.. ఒక్క సంతూర్‌ బ్రాండ్‌ రూ.2650 కోట్ల విలువైన విక్రయాలు సాధించింది. మరోవైపు వేగంగా విస్తరిస్తున్న ఫుడ్‌ మార్కెట్‌ను అందిపుచ్చుకునేందుకు నిరప్పర, బ్రాహ్మిణ్స్‌ బ్రాండ్లను విప్రో గతంలో కొనుగోలు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని