SIP: రోజూ రూ.100 సిప్‌ చేయండి.. జెడ్‌ఫండ్స్‌ కొత్త పథకం!

ప్రముఖ మ్యూచువల్‌ ఫండ్ల పంపిణీ వేదికైన జెడ్‌ఫండ్స్‌ మరో కొత్త పథకంతో ముందుకు వచ్చింది. రోజూ రూ.100 మదుపు చేయగల క్రమానుగత పెట్టుబడి పథకాన్ని (SIP) ప్రవేశపెట్టింది......

Published : 22 Feb 2022 19:08 IST

దిల్లీ: ప్రముఖ మ్యూచువల్‌ ఫండ్ల పంపిణీ వేదికైన జెడ్‌ఫండ్స్‌ మరో కొత్త పథకంతో ముందుకు వచ్చింది. రోజూ రూ.100 మదుపు చేయగల క్రమానుగత పెట్టుబడి పథకాన్ని (SIP) ప్రవేశపెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ ఆదాయం ఉండే వారిని దృష్టిలో ఉంచుకొని దీన్ని తీసుకొచ్చింది.

ఈ మేరకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌, టాటా మ్యూచువల్‌ ఫండ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు జెడ్‌ఫండ్స్‌ వెల్లడించింది. మరికొన్ని సంస్థలతోనూ చేతులు కలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొంది. రూ.100 సిప్‌తో టైర్‌-2, టైర్‌-3, టైర్‌-4 పట్టణాల ప్రజల మదుపు అవసరాలు సైతం తీరుతాయని వివరించింది. ఈ ప్రాంతాల్లో చాలా మంది ప్రజలకు నెలవారీ ఆర్జన కంటే రోజువారీ ఆదాయమే ఉంటుందని తెలిపింది. రోజుకూలీలు, చిరు వ్యాపారులుకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొంది.

ప్రారంభించిన కొద్ది సమయంలోనే 3,000 రోజువారీ సిప్‌ పథకాలను విక్రయించామని జెడ్‌ఫండ్స్‌ తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరంలో లక్ష సిప్‌లను విక్రయించడమే తమ లక్ష్యమని పేర్కొంది. 2021లో ఈ వేదికపై దాదాపు 4 కోట్ల మంది నెలవారీ సిప్‌ను తీసుకున్నట్లు వెల్లడించింది. భారత్‌లో మ్యూచువల్‌ ఫండ్లను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు నెలవారీ సిప్‌ దోహదం చేస్తుందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని