Zomato CEO: 15 కేజీలు తగ్గిన జొమాటో సీఈఓ.. ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఇదేనట!

Deepinder Goyal: ప్రముఖ ఫుడ్‌డెలివరీ సంస్థ జొమాటో సీఈఓ, వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్‌ (Deepinder Goyal) తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టారు. తన ఫిట్‌నెస్‌ జర్నీని నెటిజన్లతో పంచుకున్నారు.

Updated : 01 Aug 2023 17:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో అందరూ ఇంటికే పరిమితమయ్యారు. కొందరు ఆ సమయాన్ని తమ నైపుణ్యాలను పెంచుకోవటానికి ఉపయోగిస్తే..  మరికొందరేమో మెరుగైన ఆహారపు అలవాట్లపై దృషి పెట్టారు. జొమాటో సీఈఓ (Zomato CEO) దీపిందర్‌ గోయల్‌ (Deepinder goyal) మాత్రం ఫిట్‌నెస్‌పై దృష్టి సారించారు. లాక్‌డౌన్‌ సమయంలో మొదలుపెట్టిన తన ఫిట్‌నెట్ జర్నీ (fitness journey) గురించి తాజాగా పంచుకున్నారు. 2019 vs 2023 అంటూ పాత, కొత్త ఫొటోలతో పాటు బరువు, కొలెస్ట్రాల్‌ స్థాయి రాసి ఉన్న నోట్‌నూ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ చేశారు.

‘2017లోనే నా ఫిట్‌నెస్‌ ప్రయాణాన్ని ప్రారంభించా. వ్యాపారంతో పాటూ అరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వటం మొదలుపెట్టా. దేన్నీ అతిగా చేయలేదు. ప్రారంభించిన ఏ పనీ మధ్యలో ఆపలేదు. ఫలితాలు ఇవే’ అంటూ మాటలు జోడించి 2019లో తాను తీసుకున్న ఫొటోకు ప్రస్తుతం ఉన్న ఫొటోను దీపిందర్‌ పోస్ట్‌ చేశారు. ‘2019లో 87 కిలోలు ఉండేవాడిని. 2023 నాటికి 15 కిలోలు తగ్గి 72 కిలోలకు చేరా’ అని ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని మరింత వివరంగా తన బ్లాగ్‌లోనూ పంచుకున్నారు. ‘రోజూ ఎక్సర్‌సైజులు చేస్తూనే కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకునేవాడిని. వారాంతాల్లో ఒకటి లేదా రెండు రోజులు మాత్రం గులాబ్‌ జామూన్‌, చికెన్‌ తినేవాడిని. మొత్తంగా మునుపటి ఆహారపు అలవాట్లతో పోలిస్తే ప్రతి వారం మరింత మెరుగయ్యేవాడిని. ఇలా క్రమం తప్పకుండా చేయటం నా శారీరక, మానసిక ఆరోగ్యం రెండింటిపై సానుకూల ప్రభావాన్ని చూపింది’ అంటూ రాసుకొచ్చారు. 

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌.. ఈ కార్డులపై 10% డిస్కౌంట్‌

దీపిందర్‌ గోయల్‌ ఫిట్‌నెస్‌ జర్నీ గురించి చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. కొందరు నెటిజన్లు ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ‘మీ ఆరోగ్య ప్రయాణాన్ని పంచుకోవటం మాకు నచ్చింది. అయితే దాంతో పాటు మీ హెల్త్ హ్యాక్స్‌ గురించి పంచుకోండి’ అని ఓ వ్యక్తి కామెంట్‌ చేశాడు. ‘విజయవంతమైన స్టార్టప్‌ను నడపటమే కాకుండా ఫిట్‌నెస్‌ పరంగా కూడా ప్రేరణ నింపారు’ అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని