డ్రగ్స్‌ కేసులో విచారణకు నటుడి ప్రియురాలు

మాదకద్రవ్యాల కేసులో బాలీవుడ్‌ విలక్షణ నటుడు అర్జున్‌ రాంపాల్‌ ప్రియురాలు గాబ్రియేల్ల దెమిత్రియాడెస్‌ను నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ముందు విచారించింది...

Published : 12 Nov 2020 01:39 IST

ముంబయి: మాదకద్రవ్యాల కేసులో బాలీవుడ్‌ విలక్షణ నటుడు అర్జున్‌ రాంపాల్‌ ప్రియురాలు గాబ్రియేల్ల దెమిత్రియాడెస్‌ను నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ)  విచారించింది. బుధవారం మధ్యహ్నం 12 గంటలకు దక్షిణ ముంబయిలోని ఎన్‌సీబీ కార్యాలయానికి చేరుకోగా అధికారులు ఆమెను ప్రశ్నించారు. ఇదే కేసులో అర్జున్‌ రాంపాల్‌ సైతం గురువారం విచారణకు హాజరు కానున్నాడు.

నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి విచారణలో బాలీవుడ్‌లో డ్రగ్స్‌ వాడకం విషయం బయటపడింది. సుశాంత్‌ సన్నిహితురాలు రియా చక్రవర్తి వాట్సాప్‌ చాట్‌తో అధికారులు పలు కీలక సమాచారం సేకరించారు. సుశాంత్‌కి రియా డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు నిర్ధారించి ఆమెను అరెస్టు చేశారు. రియాతోపాటు ఆమె సోదరుడు సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో బాలీవుడ్‌కి చెందిన పలువురిని అధికారులు ప్రశ్నించారు. గత సోమవారం అర్జున్‌ రాంపాల్‌ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. అనంతరం విచారణకు హాజరుకావాలంటూ రాంపాల్‌తోపాటు గాబ్రియేల్లకు కూడా సమన్లు జారీ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని