కేరళ విమాన ప్రమాదం: బ్లాక్‌బాక్స్‌ లభ్యం

కోలికోడ్‌ విమానాశ్రయం రన్‌వేపై శుక్రవారం చోటు చేసుకున్న విమాన ప్రమాద ఘటనలో.. కూలిపోయిన విమానానికి చెందిన బ్లాక్‌ బాక్స్‌ లభ్యమయింది.

Published : 09 Aug 2020 00:30 IST

కొలికోడ్‌: కేరళలోని కొలికోడ్‌ విమానాశ్రయం రన్‌వేపై శుక్రవారం చోటు చేసుకున్న విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. విమానం నుంచి బ్లాక్బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. ఇందులో ఉండే డిజిటల్‌ ఫ్లైట్‌ డేటా‌ రికార్డర్‌ (డీఎఫ్‌డీఆర్‌), కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ (సీవీఆర్‌)లలో నిక్షిప్తమైన సమాచారాన్ని విశ్లేషించనున్నారు. దీని ద్వారా.. విమానం ఎత్తు, స్థితి, వేగానికి సంబంధించిన వివరాలతోపాటు.. ప్రమాద సమయంలో పైలట్ల మధ్య జరిగిన సంభాషణ వివరాలు కూడా లభించనున్నాయి. దీంతో ప్రమాదానికి గురైన ఎయిరిండియా ఐఎక్స్‌-1344 విమానంలో ఏం జరిగి ఉంటుందో తెలుసుకునే వీలవుతుందని అధికారులు తెలిపారు.

దుబాయి నుంచి కొలికోడ్‌‌కు వస్తున్న ఈ విమానం రన్‌వేపై అదుపుతప్పి జారిపడటంతో రెండు ముక్కలైంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 19కి చేరింది. క్షతగాత్రులు సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని