
ఆసుపత్రి భవనం పైనుంచి దూకి కరోనా రోగి మృతి
మంగళగిరి రూరల్ : గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలోని ఎన్నారై ఆసుపత్రి భవనం పైనుంచి కరోనా రోగి కిందకు దూకాడు. గుంటూరు మారుతీనగర్‌కు చెందిన నాగమురళి (66)కి కరోనా సోకడంతో ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం ఉదయం భవనం మూడో అంతస్తు నుంచి కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన సిబ్బంది అత్యవసర విభాగానికి తరలించి వైద్యసేవలు అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.