భవనం కూలిన ఘటనలో 40కి చేరిన మృతులు

మహారాష్ట్రలోని భివాండిలో మూడంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరింది. తాజాగా మరికొందరి మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు........

Published : 23 Sep 2020 19:22 IST

ఠానే: మహారాష్ట్రలోని భివాండిలో మూడంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరింది. తాజాగా మరికొందరి మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చినట్టు అధికారులు వెల్లడించారు. సోమవారం అర్ధరాత్రి అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో భవనం కూలిపోవడంతో ఈ విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.  ఆ రోజు నుంచి ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. మృతి చెందినవారిలో 18మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో రెండేళ్ల నుంచి 15 ఏళ్ల లోపువారే ఉండటం విషాదకరం. ఇప్పటివరకు 25మందిని శిథిలాల నుంచి సజీవంగా బయటకు తీసుకొచ్చినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు, భారీ వర్షం కురుస్తున్నప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయాలతో బయటపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

పటేల్‌ కాంపౌండ్‌ సమీపంలోని ఉన్న భవనాన్ని 43 ఏళ్ల క్రితం నిర్మించారు. దీనిలో మొత్తం 40 ఫ్లాట్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 150 మంది వరకు నివసిస్తారని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో భవనం యజమానిపై కేసు నమోదు చేయడంతో పాటు ఇద్దరు స్థానిక అధికారులను సస్పెండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని