504 బంగారు బిస్కెట్లు.. 8మంది అరెస్ట్!

దేశ రాజధాని దిల్లీలో అక్రమంగా రవాణా చేస్తున్న బంగారం భారీగా పట్టుబడింది. పసిడి తరలిస్తున్న ముఠా గుట్టును ఛేదించిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు.. ఎనిమిది మందిని శుక్రవారం అరెస్టు..........

Published : 30 Aug 2020 01:57 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో అక్రమంగా రవాణా చేస్తున్న బంగారం భారీగా పట్టుబడింది. పసిడి తరలిస్తున్న ముఠా గుట్టును ఛేదించిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు.. ఎనిమిది మందిని శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచి 504 విదేశీ బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. 83.621 కిలోల బరువుండే వీటి విలువ రూ.42.89 కోట్లు ఉంటుందని అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. నకిలీ గుర్తింపు కార్డులు కలిగిన నిందితులు ఈ బంగారాన్ని ప్రత్యేకంగా కుట్టించిన వస్త్రాల్లో తరలిస్తున్నట్టు తమకు సమాచారం అందిందని తెలిపారు. దిబ్రూగఢ్‌ నుంచి దిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలులో తరలిస్తుండగా వారిని పట్టుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ బంగారు బిస్కెట్లను మయన్మార్ నుంచి మణిపూర్‌లోని మోరే వద్ద అంతర్జాతీయ సరిహద్దు నుంచి భారత్‌లోకి అక్రమంగా రవాణా చేసినట్టు ఇంటెలిజెన్స్‌ వర్గాలు గుర్తించాయి.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts