కౌంటింగ్‌ కేంద్రంపై దాడికి యత్నం.. వ్యక్తి అరెస్టు!

అమెరికాలో ఓట్ల లెక్కింపు జరుగుతున్న కేంద్రంపై దాడికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పెన్సెల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో గురువారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) ఓట్ల లెక్కింపు.............

Updated : 23 Feb 2024 17:40 IST

ఫిలడెల్పియా: అమెరికాలో ఓట్ల లెక్కింపు జరుగుతున్న కేంద్రంపై దాడికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పెన్సెల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో గురువారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) ఓట్ల లెక్కింపు జరుగుతుండగా దాడికి యత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఫిలడెల్ఫియాలో చోటుచేసుకుంది. వర్జీనియా నుంచి వాహనంలో వచ్చిన వ్యక్తులు ఈ దాడికి ప్రయత్నించినట్టు గుర్తించిన పోలీసులు.. నిందితుడు ప్రయాణించిన వాహనం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్లు లెక్కింపు జరుగుతున్న సమయంలో ఈ అరెస్టు చోటుచేసుకుంది. 

మరోవైపు, అమెరికా ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. డెమొక్రాట్‌ అభ్యర్థి జో బైడెన్‌, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్న ఈ రసవత్తర పోరులో మొత్తంగా చూస్తే బైడెన్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే, పెన్సెల్వేనియా రాష్ట్రంలో మాత్రం ఇప్పటికే 90శాతం ఓట్ల లెక్కింపు పూర్తి కాగా.. ట్రంప్‌ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని