కారుపై మూత్రం పోయొద్దన్నందుకు.. దుశ్చర్య!

మహారాష్ట్రలో ఓ ఆటో డ్రైవర్ దుశ్చర్యకు ఒడిగట్టాడు. కారుపై మూత్ర విసర్జన చేయొద్దని వారించిన సెక్యూరిటీ గార్డును పెట్రోల్‌ పోసి తగలబెట్టి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన పుణెలోని భోసారి పారిశ్రామిక ప్రాంతంలో..........

Published : 19 Nov 2020 02:13 IST

పుణె: మహారాష్ట్రలో ఓ ఆటో డ్రైవర్ దుశ్చర్యకు ఒడిగట్టాడు. కారుపై మూత్ర విసర్జన చేయొద్దని వారించిన సెక్యూరిటీ గార్డును పెట్రోల్‌ పోసి తగలబెట్టి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన పుణెలోని భోసారి పారిశ్రామిక ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌ వయ్‌ఫాల్కర్‌ అనే వ్యక్తి భోసారి పారిశ్రామిక ప్రాంతంలో ఓ వాణిజ్య సముదాయంలో సెక్యూరిటీగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి అతడు డ్యూటీలో ఉండగా మహేంద్ర బాలు అనే ఆటోడ్రైవర్‌ అక్కడికి వచ్చాడు. ఆటో ఆపి అక్కడ నిలిపి ఉన్న కారుపై మూత్ర విసర్జన చేయబోయాడు. ఈ క్రమంలో సెక్యురిటీ గార్డు‌ వచ్చి అడ్డుకున్నాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆటోడ్రైవర్‌.. ఆ సమయంలో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తెల్లవారుజామున తిరిగి పెట్రోల్‌తో అక్కడికి చేరుకుని సెక్యూరిటీ గార్డుపై పోసి తగలబెట్టాడు. వెంటనే అతడు తేరుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని