రెట్టింపు ఇస్తామన్నారు..ఆపై బెదిరించారు

డబ్బు తీసుకొని ఇద్దరు వ్యక్తులు తనను మోసం చేశారని రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో రంగమ్మ అనే నర్సు ఫిర్యాదు చేశారు.

Published : 03 Sep 2020 02:48 IST

రాయదుర్గం పోలీసులకు నర్సు ఫిర్యాదు

హైదరాబాద్‌: డబ్బు తీసుకొని ఇద్దరు వ్యక్తులు తనను మోసం చేశారని రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో రంగమ్మ అనే నర్సు ఫిర్యాదు చేశారు. గతేడాది రాజేశ్‌ అనే వ్యక్తి రూ.55 లక్షలు, సింహాచలం అనే వ్యక్తి రూ.15 లక్షలు తీసుకున్నారని, నెలరోజుల్లో రెట్టింపు డబ్బు ఇస్తామని నమ్మించారని బాధితురాలు చెబుతున్నారు. జామీనుగా ప్లాట్లు రాసిస్తామన్నారని, డబ్బు విషయమై శంషాబాద్‌ లాడ్జికి పిలిపించి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కత్తితో బెదిరించడంతోపాటు అసభ్యంగా ప్రవర్తించారని రంగమ్మ ఆరుగురిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని