APSRTC Driver: ఆర్టీసీ డ్రైవర్‌లపై దాడి కేసులో ఏడుగురి అరెస్టు: నెల్లూరు ఎస్పీ

ఏపీఎస్‌ఆర్టీసీ డ్రైవర్‌లపై దాడి కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌ రెడ్డి తెలిపారు.

Published : 29 Oct 2023 12:55 IST

నెల్లూరు: ఏపీఎస్‌ఆర్టీసీ డ్రైవర్‌లపై దాడి కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌ రెడ్డి తెలిపారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన ఆయన.. ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్‌ కోసం గాలిస్తున్నామన్నారు. నేరం జరిగిన వెంటనే నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. నిందితులంతా నకిలీ నోట్ల మార్పిడి ముఠాకు చెందిన వారని, ప్రజలను బెదిరించడం, మోసం చేయడం.. ఈ ముఠా నైజమని తెలిపారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఆయన వివరించారు. ముఠాపై గతంలోనే పలు కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. 

‘చంపి పాతిపెడతాం.. ఎవరొస్తారో చూస్తాం!’

హారన్ కొట్టారనే నెపంతో కావలి పరిధిలో ఆర్టీసీ డ్రైవర్‌లు బి.ఆర్‌.సింగ్‌, శ్రీనివాసరావులపై 14 మంది విచక్షణారహితంగా దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిని ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ వేదిక తీవ్రంగా ఖండించింది. డ్రైవర్లపై వైకాపా మూకలు రెచ్చిపోయి విచక్షణారహితంగా కొట్టడం దారుణమని  ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని మండిపడ్డారు. పోలీసుల ఉదాసీన వైఖరి వల్లే సామాన్యులపై దౌర్జన్యాలు పెరిగాయని ధ్వజమెత్తారు. నిందితులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని