Andhra News: ప్రేమించలేదని విద్యార్థిని గొంతుకోసిన ఆటోడ్రైవర్‌

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించలేదని యువతిని ఓ యువకుడు గొంతు కోశాడు.

Updated : 21 Mar 2022 20:10 IST

వెంకటగిరి: నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించలేదని ఓ యువకుడు విద్యార్థిని గొంతు కోశాడు. వివరాల్లోకి వెళితే.. వెంకటగిరిలోని కాలేజీమిట్టకు చెందిన ఓ బాలిక (17) ఇంటర్‌ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్‌ చెంచుకృష్ణ ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్నాడు. విషయం తెలుసుకున్న విద్యార్థిని కుటుంబ సభ్యులు యువకుడిని మందలించారు. ఈ క్రమంలో ఆమెపై కోపం పెంచుకున్న చెంచుకృష్ణ.. సోమవారం ఉదయం ఇంట్లో నిద్రిస్తున్న బాలికను గమనించాడు.

అదే సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇదే అదునుగా చూసి ఇంట్లోకి చొరబడి కత్తితో విద్యార్థిని గొంతు కోశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిన తర్వాత కల్లు తాగి తన ఇంటికి వెళ్లి తలుపులేసుకున్నాడు. గాయాలపాలైన విద్యార్థిని గుర్తించిన స్థానికులు ఈ దారుణానికి పాల్పడింది చెంచుకృష్ణే అని తెలుసుకున్నారు. అనంతరం అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన యువతికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై కోటిరెడ్డి తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని