Telangana news: ఏసీబీ వలకు చిక్కిన ‘బుల్లెట్‌ బండి పెళ్లికొడుకు’

బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పట్టణ ప్రణాళిక అధికారి ఆకుల ఆశోక్‌ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల

Published : 21 Sep 2022 02:12 IST

హైదరాబాద్‌: గతేడాది తన పెళ్లి సమయంలో ‘బుల్లెట్‌ బండి’ సాంగ్‌తో పాపులర్‌ అయిన పెళ్లికొడుకు ఏసీబీకి పట్టుబడ్డాడు. బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారిగా పనిచేస్తున్న ఆకుల ఆశోక్‌ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలకు చిక్కాడు. ప్రణాళికా విభాగంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న అశోక్‌.. ఇంటి నిర్మాణం విషయంలో తన వద్దకు వచ్చిన  దేవేందర్‌రెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.30 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. ఆ మొత్తం నగదును తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి అశోక్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంతో పాటు అశోక్‌ నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగించారు. ‘బుల్లెట్‌ బండి’ పాటకు డ్యాన్స్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన పెళ్లి కుమార్తె భర్తే ఈ అశోక్‌. ఈ సాంగ్‌తో అతడు కూడా సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని