Andhra News: మట్టిమాఫియాను అడ్డుకున్న గుడివాడ ఆర్‌ఐపై ‘లంచం’ కేసు

కృష్ణా జిల్లా మోటూరులో ఆర్‌ఐ అరవింద్‌పై దాడి ఘటనలో మరో మలుపు చోటు చేసుకుంది. ఆర్ఐ అరవింద్‌, రెవెన్యూ సిబ్బందిపై తాజాగా కేసు నమోదైంది. అరవింద్ అర్ధరాత్రి వచ్చి

Published : 28 Apr 2022 01:34 IST

గుడివాడ: కృష్ణా జిల్లా మోటూరులో ఆర్‌ఐ అరవింద్‌పై దాడి ఘటనలో మరో మలుపు చోటు చేసుకుంది. ఆర్ఐ అరవింద్‌, రెవెన్యూ సిబ్బందిపై తాజాగా కేసు నమోదైంది. అరవింద్ అర్ధరాత్రి వచ్చి లంచం డిమాండ్‌ చేశారని గంటా లక్ష్మణరావు అనే వ్యక్తి కేసు పెట్టారు. దీంతో ఆర్‌ఐ అరవింద్‌, వీఆర్‌వో, వీఆర్‌ఏపై కేసు నమోదు చేశారు. 

ఇటీవల గుడివాడ మండలం మోటూరులో అక్రమ మట్టి తవ్వకాలను ఆర్‌ఐ అరవింద్‌ అర్ధరాత్రి సమయంలో అడ్డుకున్నారు. దీంతో అతనిపై మట్టి మాఫియా హత్యాయత్నానికి తెగబడింది. జేసీబీతో ఆర్‌ఐని నెట్టేసింది. ఈ నేపథ్యంలో ఆర్‌ఐపై ‘లంచం’ కేసు నమోదుకావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని