కుమ్రం భీం జిల్లాలో ఎదురు కాల్పులు

కుమ్రం భీం జిల్లా తిర్యాణి మండలం మాంగీ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లు

Published : 16 Jul 2020 03:38 IST

తిర్యాణి: కుమ్రం భీం జిల్లా తిర్యాణి మండలం మాంగీ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లు సమాచారం. పోలీసులకు తారసపడిన ముగ్గురు మావోయిస్టులు తప్పించుకునే క్రమంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. గత మూడు రోజులుగా పోలీసులు మాంగీ, గుండాల, పంకిడి మాదర అటవీ ప్రాంతాల్లో కూంబింగ్‌  నిర్వహిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల్లో రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు