
Karnataka: కర్ణాటకలో విషాదం.. విషం తాగి ఐదుగురి ఆత్మహత్య
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని హుకేరీ పట్టణంలో విషాదం నెలకొంది. బోర్గాల్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం విషం తాగి ప్రాణాలొదిలింది. ఈ ఘటనలో ఓ ఇంటి యజమాని సహా నలుగురు పిల్లలు మృతి చెందినట్లు సమాచారం. బ్లాక్ ఫంగస్‌తో ఆ ఇంటి యజమాని భార్య గతేడాదే మరణించించారు. ఆమె మృతితో కుటుంబం మొత్తం కుంగుబాటులోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.