Crime News: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం.. మరో నలుగురి అరెస్టు

తెరాస ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో బంజారాహిల్స్ పోలీసులు మరో నలుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రసాద్‌కు సహకరించిన సంతోష్, సుగుణ, సురేందర్,

Published : 10 Aug 2022 19:33 IST

హైదరాబాద్: తెరాస ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హత్య చేసేందుకు యత్నించిన మరో నలుగురిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రసాద్‌కు సహకరించిన సంతోష్, సుగుణ, సురేందర్, సాగర్‌లను అరెస్టు చేసినట్లు డీసీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ మీడియాకు వెల్లడించారు. ఈ నెల 6న ప్రధాన నిందితుడు ప్రసాద్‌ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే.

డీసీపీ మాట్లాడుతూ.. ‘‘అదుపులోకి తీసుకున్న నిందితుడు ప్రసాద్‌ నుంచి కొన్ని వివరాలు సేకరించాం. నాంపల్లిలో ఎయిర్ పిస్టల్, మహారాష్ట్రలోని నాందేడ్‌లో కత్తి, బిహార్‌లో దేశవాళీ తుపాకీ కొనుగోలు చేసినట్లు గుర్తించాం. దేశవాళీ తుపాకీ, ఎయిర్ పిస్టల్ కొనుగోలు చేసేందుకు సంతోష్, సుగుణ, సురేందర్, సాగర్‌ కలిసి ప్రసాద్‌కు సహకరించినట్లు దర్యాప్తులో తేలింది. బిహార్‌కు చెందిన మున్నా కుమార్‌ నుంచి రూ.60వేలకు ప్రసాద్ దేశవాళీ తుపాకీ కొనుగోలు చేశాడు. తుపాకీ విక్రయించిన మున్నా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ప్రసాద్‌ను కస్టడీకి తీసుకొని ప్రశ్నిస్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది’’ అని డీసీపీ వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని