రాజస్థాన్‌లో మరో జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఘటన!

ఆఫ్రో-అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతితో అగ్రరాజ్యం అట్టుడుకుతున్న వేళ.. ఆ దారుణాన్ని తలపించే ఘటన తాజాగా రాజస్థాన్‌లో చోటు చేసుకుంది...

Published : 05 Jun 2020 15:55 IST

రాజస్థాన్‌: ఆఫ్రో-అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతితో అగ్రరాజ్యం అమెరికా అట్టుడుకుతున్న వేళ.. ఆ దారుణాన్ని తలపించే ఘటన తాజాగా రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... జోధ్‌పూర్‌లోని బల్దేవ్‌నగర్‌కు చెందిన ముకేశ్‌ కుమార్‌ మాస్కు ధరించకుండా రోడ్డుపైకి వచ్చాడు. ఇది గమనించిన స్థానిక పోలీసులు లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించకుండా బాధ్యతారహితంగా బయట తిరుగుతున్నాడని సదరు వ్యక్తిపై అమానుషంగా ప్రవర్తించారు. అతడిని కిందపడేసి మెడపై మోకాలితో తొక్కి విచక్షణా రహితంగా కొట్టారు. దీనికి సంబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా ఇది కాస్తా వైరల్‌గా మారింది. ఈ ఘటనలో పోలీసులు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని