ఢాకాలో బోటు ప్రమాదం.. 23మంది మృతి

బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరం సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బురిగంగ నదిలో.....

Published : 30 Jun 2020 01:05 IST

ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరం సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బురిగంగ నదిలో రెండు బోట్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ బోటు నీటిలో మునిగిపోవడంతో 23 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. 100 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోటును మరో ప్రయాణికుల బోటు ఢీకొట్టిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మృతిచెందిన వారిలో ఆరుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారని వెల్లడించారు. ఇప్పటివరకు 23మంది మృతదేహాలను గుర్తించామనీ.. మిగతా వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

‘బోటులో 50 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. మిగతా వారి ఆచూకీ కోసం రెస్క్యూ బృందం గాలిస్తోంది’ అని అగ్నిమాపకదళ అధికారి ఎనాయెట్ హుస్సేన్ తెలిపారు పేర్కొన్నారు. వాహనంలో 50 మందికి పైగా ప్రయాణిస్తున్నారని, చాలామంది క్యాబిన్లలో చిక్కుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని