బైక్‌ను ఢీకొట్టిన వాహనం.. ముగ్గురి దుర్మరణం

మేడ్చల్‌ జిల్లాలో ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఘట్‌కేసర్‌ సీఐ ఎన్‌.చంద్రబాబు వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో వరంగల్‌-హైదరాబాద్‌

Updated : 24 Jun 2022 06:13 IST

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో ఘటన

పాలడుగు నవీన్‌, దాసరి నవీన్‌, వినీత

ఘట్‌కేసర్‌, న్యూస్‌టుడే: మేడ్చల్‌ జిల్లాలో ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఘట్‌కేసర్‌ సీఐ ఎన్‌.చంద్రబాబు వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారి అవుషాపూర్‌ సమీపంలో ప్రమాదం చోటుచేసుకుందని డయల్‌ 100కు సమాచారం వచ్చింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలం సింగరాజపల్లికి చెందిన పాలడుగు నవీన్‌(25) ఉప్పల్‌లో ఉంటూ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నారు. అదే జిల్లా లింగాలఘనాపూర్‌ మండలం కొత్తపల్లికి చెందిన దాసరి నవీన్‌(23) దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటూ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం మెట్లచింతాపూర్‌ గ్రామానికి చెందిన ఎన్‌.వినీత(21) హిమాయత్‌నగర్‌లోని ఓప్రైవేటు వసతి గృహంలో ఉంటోంది. ఈ ఘటనలో వీరు ముగ్గురు మృతిచెందినట్లు గుర్తించారు. దాసరి నవీన్‌, వినీత పంజాగుట్టలోని ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నారు. బుధవారం ముగ్గురు బైకుపై యాదాద్రికి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున ఉప్పల్‌ వైపు బైకుపై కలిసి వస్తుండగా ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఈమేరకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి, మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్న ఓ లారీని గుర్తించారు. తెల్లవారుజామున 4:40గంటల ప్రాంతంలో జాతీయ రహదారి పక్కన ఓ బంకులో పెట్రోల్‌ పోయించుకున్నట్లు సీసీ కెమెరాలో గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని